శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2019 (16:16 IST)

పడకపై ఆరు అడుగుల పాము.. భర్తకు భార్య అర్థరాత్రి ఫోన్..

చిన్నారులు నిద్రించే పడకపై అర్థరాత్రి పూట ఆరు అడుగుల పాము కనిపించింది. ఆ పామును చూసిన ఆ తల్లి షాక్ అయ్యింది. సాయం చేసేందుకు భర్త పక్కన లేడు. స్థానికులు ఎంత అరిచినా సహకరించలేదు. చివరికి ఆ పామును అటవీ శాఖాధికారుల సాయంతో ఇంటి నుంచి తీసుకెళ్లడం జరిగింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హర్యానా, సుల్తాన్ పూర్‌కు చెందిన రాజేశ్ కుమార్ భార్య మంజలి. రాజేష్, మంజలి దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె వున్నారు. సోమవారం రాజేశ్ ఉద్యోగం కోసం బయటూరుకు వెళ్లాడు. మంజలి, పిల్లలు ఇంట్లో నిద్రిస్తుండగా.. ఉన్నట్టుండి రాజేశ్‌కు మంజలి అర్థరాత్రి పూట ఫోన్ చేసింది. ఆ ఫోన్ రాగానే రాజేశ్ భయాందోళనలకు గురయ్యాడు. 
 
మంజలి పిల్లలతో కలిసినిద్రిస్తుండగా పడకపై ఆరడుగుల పాము వున్నదని.. ఆ పాము కాస్త తన కుమారుడి దిండు వద్దే వుండటంతో షాకైనట్లు భర్తతో చెప్పింది. వెంటనే పిల్లల్ని ఆ గది నుంచి తీసుకుని వెలుపలికి వచ్చేసిన మంజలి.. పొరుగింటి వారి సాయం కోరింది. కానీ ఎంత అరిచినా ఎవ్వరూ సాయం చేసేందుకు రాకపోవడంతో భర్తకు ఫోన్ చేసింది.
 
ఆపై అటవీ శాఖాధికారులకు రాజేశ్ ఫోన్ చేశాడు. ఆపై రాజేశ్ కుమారుడి బెడ్ షీట్‌లో వున్న ఆ పామును అధికారులు అడవిలో వదిలిపెట్టేందుకు తీసుకెళ్లారు. దాంతో మంజలితో పాటు ఆ చిన్నారులు ఊపిరి పీల్చుకున్నారు.