సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (19:38 IST)

ఫోర్బ్స్ 2023: టాప్-10 సంపన్నులు.. తొమ్మిదో స్థానంలో ముఖేష్ అంబానీ

mukesh ambani
ఫోర్బ్స్ 2023 సంవత్సరానికి ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలోని టాప్-10 మంది సంపన్నులలో భారతీయ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. తాజాగా, 2023 సంవత్సరానికి గానూ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది.
 
ఇందులో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బెర్నార్డ్ జీన్ ఎటియన్ ఆర్నాల్ట్ 2023 సంవత్సరంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఆయన సంపద 211 బిలియన్ డాలర్లు. 
 
ఈ జాబితాలో 200 బిలియన్ డాలర్ల సంపద ఉన్న వ్యక్తి ఒక్కరే కావడం గమనార్హం. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచారు. అంతకుముందు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఎలోన్ మస్క్ సంపద 180 బిలియన్ డాలర్లు.
 
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కూడా ఈ జాబితాలో టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో ఆయన 9వ స్థానంలో ఉన్నాడు. ముఖేష్ అంబానీ సంపద 83.4 బిలియన్ డాలర్లు. 
 
గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది దాదాపు ప్రపంచంలోని ధనికులంతా తమ సంపదను కోల్పోయారు. స్టాక్స్ విలువ పడిపోవడం, రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం, స్టార్టప్‌లలో పెట్టుబడులు కోల్పోవడం మొదలైన కారణాల వల్ల వారు తమ సంపదలో గణనీయమైన భాగాన్ని కోల్పోయారు.
 
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ఫోర్బ్స్ జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మూడో స్థానంలో నిలిచారు. అతని సంపద 114 బిలియన్ డాలర్లు. 
 
ఇకపోతే.. 4) లారీ ఎల్లిసన్ - $107 బిలియన్
5) వారెన్ బఫెట్ - $106 బిలియన్
6) బిల్ గేట్స్ - 104 బిలియన్ డాలర్లు
7) మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ - $94.5 బిలియన్
8) కార్లోస్ స్లిమ్ - 93 బిలియన్ డాలర్లు
9) ముఖేష్ అంబానీ - 83.4 బిలియన్ డాలర్లు
10) స్టీవ్ బాల్మెర్ - $80.7 బిలియన్‌ టాప్-10లో నిలిచారు.