సోమవారం, 3 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 3 మార్చి 2025 (15:34 IST)

ట్రంప్-జెలన్‌స్కీ ఫైటింగ్, ట్విట్టర్ మీమ్స్ నవ్వలేక పొట్ట చెక్కలవుతోంది(video)

trump zelensky fight ai
కర్టెసి-ట్విట్టర్
మీ వైఖరితో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేట్లున్నది అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నేపధ్యంలో ట్విట్టర్లో మీమ్స్ అదిరిపోతున్నాయి. ఈ ఇద్దరు అధ్యక్షులు పరస్పరం దాడి చేసుకుంటున్నట్లు మీమ్స్ పెడుతున్నారు. ఈ మీమ్స్ చూసిన నెటిజన్లు తమ పొట్ట చెక్కలవుతోందని కామెంట్లు పెడుతున్నారు.
 
చివరాఖరకి జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు పెట్టిన షరతుకు తలవంచక తప్పలేదు. అమెరికా డీల్‌కు తాను సిద్ధమేననీ, సంతకం చేయడానికి రెడీగా వున్నానంటూ అంగీకార సందేశాన్ని పంపారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఉక్రెయిన్ ప్రజలు సదా రుణపడి వుంటారంటూ వెల్లడించారు. ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి చర్చలకు సిద్ధం అంటూ వెల్లడించారు. మరోసారి చర్చిస్తే ఇలా కొట్టుకుంటారేమోనంటూ నెటిజన్లు మీమ్స్ పెడుతున్నారు. మీరు కూడా చూడండి.