మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. టీవీ టైమ్
  3. వార్తలు
Written By IVR
Last Modified: సోమవారం, 14 జులై 2014 (15:30 IST)

భర్త బాటలో అక్కినేని అమల... బుల్లితెరపై సీరియల్ నటిగా...

అక్కినేని అమల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆమధ్య నటించిన సంగతి తెలిసిందే. ఇపుడు అమల వెండితెర నుంచి బుల్లితెర సీరియల్ నటిగా కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో అమల దీనిపై మాట్లాడుతూ... తాను ఓ తమిళ సీరియల్‌లో డాక్టర్ పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేశారు. ‘ఊయెర్రి' అనే పేరుతో రూపొందనున్న ఈ సీరియల్ లో తాను ఓ డాక్టరుగా నటించనున్నట్లు తెలిపారు. 
 
‘సీరియిల్ స్క్రిప్టు చాలా బాగుందని, అందువల్లనే ఒప్పుకున్నాన"నీ చెప్పారు. 12 మంది వైద్యులు, వాళ్ల జీవితాలు, కుటుంబాలు, రోగుల నేపథ్యంలో సాగే ఈ సీరియల్ ఆగస్టు రెండోవారం తర్వాత ప్రసారం కావచ్చు అంటున్నారు అమల. మరి ఇంతకీ ఈ సీరియల్ ఏ టివీలో ప్రసారం కానుందో...