శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2021
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (17:55 IST)

బడ్జెట్ 2021: ఎంపీలకు ఫైవ్‌స్టార్ హోటల్ నుంచి భోజనం..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న క్రమంలో ఈసారి ఓ కీలక మార్పు చోటుచేసుకోనుంది. గత 52 ఏళ్లుగా ఎన్నడూ లేనిది ఎంపీలకు నార్త్‌ర్న్‌ రైల్వేలు కాకుండా ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నుంచి భోజనం రప్పిస్తారు. బడ్జెట్‌ రోజున పార్లమెంటేరియన్లకు ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐటీడీసీ) భారీ విందు ఏర్పాటు చేసింది. 
 
ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ కలిగిన అశోక్‌ హోటల్‌ నుంచి ఎంపీలకు చేయితిరిగిన చెఫ్‌లు సిద్ధం చేసిన వంటను వడ్డించనున్నారు. పార్లమెంట్‌కు సరఫరా చేసే ఫుడ్‌ను అశోక్‌ హోటల్‌ నిర్ధేశించిన ధరలకు కాకుండా సబ్సిడీపై అందిస్తారు.
 
కడై పనీర్‌, మిక్స్డ్‌ వెజ్‌ డ్రై, బజ్జీ, దాల్‌ సుల్తాని, పీస్‌ పులావ్‌, చపాతి, గ్రీన్‌ సలాడ్‌, రైతా, పాపడ్‌, కాలా జామూన్‌తో కూడిన వెజ్‌ ప్లేటర్‌ వంద రూపాయలకు అందిస్తారు. ఇక మినీ తాలీకి రూ.50 వసూలు చేస్తారు. 
 
స్నాక్స్‌, వెజ్‌, మినీ తాలి వంటి ఏడు రకాల మీల్స్‌తో కూడిన స్పెషల్‌ మెనూ అందుబాటులో ఉంది. కాగా, 1968 నుంచి పార్లమెంట్‌కు ఆహారం సమకూరుస్తున్న నార్తర్న్‌ రైల్వేల స్ధానంలో గత ఏడాది నవంబర్‌లో ఐటీడీసీ ఆ బాధ్యతలను చేపట్టింది.