గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (21:34 IST)

టేస్టీ పండు మిరప-గోంగూర పచ్చడి

red chilli
వేసవి రాగానే ఎర్రటి పండు మిరపకాయలు మార్కెట్లో లభిస్తాయి. వీటికితోడు గోంగూర వుంటుంది. ఈ రెండింటిని కలిపి పండుమిరప గోంగూర పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో తింటే... ఆ టేస్టే వేరు. ఎలా చేయాలో చూద్దాం.

 
కావలసినవి
గోంగూర 2 కిలోలు
ఉప్పు అరకిలో
నూనె 50 గ్రాములు
పండుమిర్చి 1 కిలో

 
తయారీ విధానం:
గోంగూర వేయించుకుని చల్లారనిచ్చి పండుమిర్చి, పసుపు, ఉప్పు వేసి దంచాలి. మెత్తగా దంచిన తర్వాత జాడీలో పెట్టుకోవాలి. కావలసినపుడు పోపు పెట్టుకోవాలి. మెత్తగా నూరి ఇంగువ పోపు పెట్టి మరికాస్త నూనె వేసుకుని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నేయి కలుపుకుని తింటుంటే అద్భుతంగా వుంటుంది.