టేస్టీగా ధనియాల చారు ఎలా చేయాలో తెలుసా?
రొటీన్ వంటలకు కాస్తంత బ్రేక్ కొట్టి కొత్త కొత్త వంటకాలను రుచి చూసేద్దాం రండి. ఇప్పుడు మనం ధనియాలు చారు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
ధనియాలు - 4 స్పూన్లు
ఉప్పు, పసుపు- తగినంత
కరివేపాకు- 2 రెబ్బలు
జీలకర్ర- 1 స్పూన్
పచ్చిమిరపకాయలు- 2
కొత్తిమీర ఒక కట్ట
చింతపడు నిమ్మకాయ సైజంత
తయారు చేసే విధానం...
ముందుగా చింతపండును ఓ గిన్నెలో వేసుకుని దాన్ని బాగా పిండి రసం తీయాలి. ఆ తర్వాత జీలకర్ర, ధనియాలు మెత్తగా నూరాలి. అందులో పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా పొంగనివ్వాలి. అటు తర్వాత బాండీలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇంగువ వేసి పోపు పెట్టాలి. అంతే... ధనియాల రసం రెడీ.