శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 15 ఫిబ్రవరి 2018 (14:25 IST)

అమ్మాయిలు చేతిలో ఫోన్ వుందంటే...? అద్దం ముందు కూర్చుంటే...?

అమ్మాయిలు ఏ పనికి ఎంతెంత టైం కేటాయిస్తారో... ఆ పనులకు సగటున ఏడాదిలో ఎంత కాలం కరిగిపోతుందో తెలుసా..? వంటి అంశాలపై జరిగిన సర్వేలో వెల్లడయిన ఫలితాలిలా ఉన్నాయి. అమ్మాయిలు డైటింగ్ కోసం ఏడాదిలో దాదాపు ఐదు వారాల సమయాన్నికేటాయిస్తారట. ఏది తింటే బరువు పెరిగి

అమ్మాయిలు ఏ పనికి ఎంతెంత టైం కేటాయిస్తారో... ఆ పనులకు సగటున ఏడాదిలో ఎంత కాలం కరిగిపోతుందో తెలుసా..? వంటి అంశాలపై జరిగిన సర్వేలో వెల్లడయిన ఫలితాలిలా ఉన్నాయి.
 
అమ్మాయిలు డైటింగ్ కోసం ఏడాదిలో దాదాపు ఐదు వారాల సమయాన్నికేటాయిస్తారట. ఏది తింటే బరువు పెరిగిపోతామో దేన్లో క్యాలరీలు తక్కువున్నాయో లాంటి లెక్కలు వేసుకుంటూ డైటింగ్ చార్టు ఫాలో కావడానికి ఆమాత్రం టైం తప్పనిసరని అంటున్నారట.
 
ఇక అమ్మాయిల షాపింగ్ ఓ పట్టాన తేలదు. ఒకటికి పది వస్తువుల్ని చూస్తారు. నూటికి వెయ్యి లెక్కవేస్తారు. అందుకే రెగ్యులర్ షాపింగ్ చేసే అమ్మాయిలు ఏడాదికి 200 గంటల 46 నిమిషాలు మాల్‌లోనే మకాం వేస్తారట.
 
అమ్మాయిల చేతుల్లో టెలిఫోన్ పడిందే అనుకోండి... ఇక కాలం తెలియదు. కబుర్లు ఏవయినా కావొచ్చు... సగటున ఒక అమ్మాయికి ఏడాదిలో నెల రోజులు టాక్ టైమ్ ఉంటుందట. 
 
అమ్మాయి అద్దం ముందు కూచుంటే ముస్తాబయ్యేందుకు పట్టే సమయం ఏడాదికి దాదాపు వారం రోజులు. ఇంకా డ్రెస్సింగ్ కోసం తీసుకునే సమయం దాదాపు ఐదున్నర రోజుల కాలం. ఇలా అమ్మాయిలు వివిధ పనులకు కాలాన్ని ఇలా ఉపయోగిస్తారట.