1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 8 నవంబరు 2014 (14:27 IST)

ప్రసవం తర్వాత మహిళలు చాక్లెట్స్ తీసుకోవచ్చా?

ప్రసవం తర్వాత మహిళలు తీసుకునే ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. పోషకాహారంతో పాటు శిశువుకు ఎలాంటి హాని కలగని ఆహారాన్ని తీసుకోవాలి. ఈ క్రమంలో చాక్లెట్‌లలో కెఫిన్ ఉండటం వలన ప్రసవం తర్వాత వీటిని తీసుకోవడం మానేయాలి. కెఫిన్ బిడ్డకు కొంత చికాకు సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అందించాలంటే.. పాలిచ్చే తల్లి చాక్లెట్‌లను నివారించాల్సిన అవసరం ఉంది.  
 
ఇక శిశువుకు ఆహార అలెర్జీలు ఉన్నాయని అనుమానం వస్తే పాల ఉత్పత్తులు, సోయా, గుడ్డు తెల్ల సొన, వేరుశెనగ, ట్రీ నట్స్, గోధుమ వంటి అలెర్జీ ఆహారాలను నివారించేందుకు ప్రయత్నించండి. జున్ను, పెరుగు, ఐస్ క్రీం వంటి పాల ఉత్పత్తులును తింటే రొమ్ము పాలలో అలెర్జీ కారకాలు వ్యాపిస్తాయి. పాల ఉత్పత్తుల వలన అలర్జీ లేదా సున్నితత్వం వంటి కొన్ని సాధారణ సమస్యలు వస్తాయి. ఇది వాంతులు, నిద్రలేమి, డ్రై లేదా కఠినమైన ఎరుపు చర్మం పాచెస్‌కు దారితీస్తుంది.