శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 9 మార్చి 2023 (20:01 IST)

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ ప్రపంచంలో అతిపెద్ద మహిళా సంస్థగా సాధికారితను ప్రదర్శించిన శ్రీజ

image
ఆర్థిక స్వేచ్ఛ, సాధికారిత యొక్క అసలైన స్ఫూర్తిని చాటుతూ ప్రపంచంలో అతిపెద్ద మహిళా నిర్మిత యాజమాన్య సంస్థ శ్రీజ, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాలలో వినోదాత్మకంగా జరుపుకోవడంతో పాటుగా రాబోయే ఆర్ధిక సంవత్సరాంతానికి వేలాది మంది నూతన సభ్యులను చేర్చుకోనున్నట్లు వెల్లడించింది.
 
శ్రీజ మహిళా మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ (ఎస్‌ఎంఎంపీసీఎల్‌), అత్యున్నత ప్రదర్శన  కనబరిచిన మహిళలను గౌరవించడంతో పాటుగా ఛైర్‌పర్సన్‌ శ్రీమతి కె శ్రీదేవి సమక్షంలో చిత్తూరు జిల్లాలోని పలు బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాల వద్ద సత్కరించారు. తమ సభ్యుల సంఖ్యను రాబోయే సంవత్సరం నాటికి 1.5 లక్షలకు చేర్చనున్నట్లు శ్రీదేవి వెల్లడించారు. ఈ ప్రాంతంలో ప్రజలకు అత్యుత్తమ నాణ్యత కలిగిన పాలను అందించేందుకు తమ మహిళా సభ్యులు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
 
తమ మహిళా సభ్యుల పట్ల తాము గర్వంగా ఉన్నట్లు ఎస్‌ఎంఎంపీసీఎల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జయతీర్ధ చారి అన్నారు. ఆయనే మాట్లాడుతూ సాధికారిత, స్వేచ్ఛలకు చుక్కాని వారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ, వారి ప్రయత్నాలను గుర్తించి, గ్రామాల నుంచి కూడా స్టార్టప్ప్‌ను అభివృద్ధి చేయడమనేది మహిళా శక్తికి అసలైన నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణాలలో 11 జిల్లాల్లో విస్తరించి ఉంది. సరాసరిన 5.5 లక్షల లీటర్లను ప్రతి రోజూ సేకరిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 900 కోట్ల రూపాయల మార్కు చేరుకుంటుందని అంచనా.