మహిళా దినోత్సవం.. ప్రత్యేక డూడుల్‌తో శుభాకాంక్షలు
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్.. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని... ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. ఈ డూడుల్ ద్వారా మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.
1977లో ఐక్యరాజ్యసమితి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా ఆమోదించిన రోజును గూగుల్ డూడుల్ సూచిస్తుంది.
ఈసారి మహిళలకు మద్దతు ఇచ్చే అనేక మార్గాలను గౌరవిస్తూ మరో క్రియేటివ్ యానిమేషన్‌తో అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది. ఈ డూడుల్ థీమ్ లక్ష్యం మహిళలకు మద్దతు ఇవ్వడమని గూగుల్ తెలిపింది.