శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 8 మే 2024 (18:49 IST)

ఈ వేసవిలో ఈ పదార్థాలను మీ ఆహారంలో భాగం చేసుకోండి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోండి

health with almonds
మండే వేసవి తరచుగా చర్మ సౌందర్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎండలో తిరగడం వల్ల చర్మ నల్లబడడం, కమిలిపోవడం లాంటివి జరుగుతుంది. అందువల్ల చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు కొన్ని ఆహార పదార్థాలను ఈ వేసివలో మన ఆహారంలో భాగంగా మార్చుకోవాలి. ఎంతో అనుభవం ఉన్న చర్మ నిపుణురాలిగా నేను కొన్ని పద్ధతుల్ని పాటిస్తాను. అవి పాటిస్తే చర్మ లోపలే కాదు బయట కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. 
 
నా క్లయింట్‌లకు కూడా నేను ఎక్కువగా చెప్పేది ఇదే. వాటిల్లో మొదటిది, అత్యంత ప్రతిభావంతమైనది.. సమతుల ఆహారపు అలవాట్లను అవలంబించడం. ఎందుకంటే అందం అనేది బాహ్య సౌందర్యం కాదు. అది లోపలి నుంచి ఉంటుంది. మనం లోపల ఎంత ఆరోగ్యంగా ఉంటే బయట అంత అందంగా కన్పిస్తాము. అయితే మారుతున్న వాతావరణంలో అద్భుతమైన చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ కొన్ని ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం.
 
ప్రతీరోజూ గుప్పెడు బాదం పప్పులు: బాదం అనేది పోషకాలు అధికంగా ఉండే గింజ. ఇందులో మెగ్నీషియం, ప్రొటీన్, రిబోఫ్లావిన్, జింక్ మొదలైన 15 పోషకాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E (ఆల్ఫా-టోకోఫెరోల్) ఉంటాయి. అన్నింటికి మించి ఇది వృద్ధాప్య ఛాయలన  తగ్గిస్తుందని నిరూపితం కూడా అయ్యింది. బాదం పప్పులు చర్మ ఆరోగ్యానికి అద్భుతంగా మేలు చేస్తాయి. అన్నింటికి మించి ఈ బాదం పప్పుల్ని వివిధ రకాలుగా వాడుకోవచ్చు మరియు ఇతర పప్పులు లేదా పండ్లతో కలిపి కూడా తినవచ్చు లేదా బాదం మిల్క్ రూపంలో కూడా తీసుకోవచ్చు. మీరు చేయాల్సిందే ఒక్కటే... బాదం పప్పుల్ని లైట్ గా వేడి చేసి, చల్లారిన తర్వాత వాటిని తురుముకుని చిన్న చిన్న ముక్కలుగా కూడా వాడుకోవచ్చు.
 
మొలకెత్తిన విత్తనాలు: మొలకెత్తిన విత్తనాలు అద్భుతమైన ఆహారం. అన్నింటికి మించి ఇదొక అద్భుతమైన స్నాక్ ఐటెమ్. వీటిని మీ సాయంత్రం అల్పాహారంగా లేదా ఆఫీసు విరామ సమయంలో తినొచ్చు. ఇందులో విటమిన్లు, మినరల్స్‌‌తో పాటు ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు కలిపి ఇంకా తినేలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ గూగుల్ చేసి మీకు తెలుసుకోవచ్చు. అయితే సలాడ్‌ల నుండి వ్రాప్స్ వరకు మీ ఆహారంలో ఈ పోషకాలు మెండుగా కలిగిన ఆహారం కచ్చితంగా ఉండాలి. తద్వారా మీ ఆరోగ్యంతో పాటు మీ నోటికి రుచికరమైన ఆహారం కూడా అందినట్లు అవుతుంది.
 
విటమిన్-సి ఎక్కువగా లభించే పండ్లు: నారింజ, బత్తాయి, ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఈ వేసవిలో విరివిగా తీసుకోండి. మీకు ఇష్టమైన పండ్లతో కలిపి ఇవి కూడా ఒక ప్రూట్ బౌల్‌లా మార్చుకుని తినవచ్చు. వీటిని మరింత ఆసక్తికరంగా చేయడానికి, మీరు బాదం వంటి గార్నిష్‌లను జోడించవచ్చు. విటమిన్లు E, C యొక్క మిశ్రమం విటమిన్ E యొక్క క్రియాశీలతకు సహాయపడుతుంది. ఇది రసాయన చికాకులు, UV-ప్రేరిత చికాకు నుండి చర్మాన్ని కాపాడుతుంది.
- డాక్టర్ గీతిక మిట్టల్, స్కిన్ ఎక్స్‌పర్ట్ మరియు కాస్మటాలజిస్ట్