బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్

27-10-2020 మంగళవారం రాశిఫలాలు - ఇష్టదైవాన్ని ఆరాధించినా సర్వదా శుభం..

మేషం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు చేకూరుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శనాలలో ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఇతరులను ముందు దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. 
 
వృషభం : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థులు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. పెంపుడు జంతువుపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతనం విడనాడండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
మిథునం : ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా సమస్యలు తలెత్తుతాయి. బంధువులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. 
 
కర్కాటకం : ఉపాధ్యాయులకు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఊహిచని ఖర్చులుమీ అంచనాలు దాటుట వల్ల ఆందోళన గురవుతాయి. రావలసిన ఆదాయం గురించి ఆందోళన చెందుతారు. మీ కుటుంబ సమస్యలు ఏకరవు పెట్టడం మంచిదికాదని గ్రహించండి. బ్యాంకింగ్ రంగాల వారు చికాకులు ఎదుర్కొంటారు. 
 
సింహం : నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఒక కార్యం నిమిత్తం దూర ప్రాంతానికి ప్రయాణం చేయవలసి రావొచ్చు. 
 
కన్య : వ్యాపారాల్లో పెరిగిన పోటీ వల్వ స్వల్ప ఆటుపోట్లు తప్పవు. వీలైతే కీలకమైన నిర్ణయాలు ఈ రోజుకు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికం. ఐరన్, సిమెంట్, కలప, ఇటుక, ఇసుక రంగంలో వారికి కలిసివచ్చే కాలం. స్త్రీలు షాపింగులకు ధనం బాగా ఖర్చు చేస్తారు.
 
తుల : విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి లభిస్తుంది. బంధువుల నుంచి విమర్శలు తప్పవు. స్త్రీలకు బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదురవుతాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. శత్రువులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. 
 
వృశ్చికం : ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. నిరుద్యోగులు, ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. నిర్మాణ పనులలో పెరిగిన వ్యయం, జాప్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగంలోని వారికి అచ్చు తప్పులు దొర్లుట వల్ల పై అధికారుల చేత మాటపడక తప్పదు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. 
 
ధనస్సు : రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. మీ పిల్లలు వైఖరి చికాకు కలిగిస్తుంది. మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై బాగా ప్రభావం చూపుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. 
 
మకరం : ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. సంఘంలో పలుకుబడిన కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థుల దుడుకుతనం తగదు. రాజకీయనాయకులు అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. 
 
కుంభం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. దైవ దర్శనాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి. నూతన పరిచయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అందివచ్చిన అవకాశం చేజారినా మంచికేనని భావించకండి. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
మీనం : గత తప్పిదాలు పునరావృత్తంకాకుండా జాగ్రత్త వహించండి. ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు ప్రతిఫలం లభిస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.