ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-07-2021 శుక్రవారం దినఫలాలు - మహాలక్ష్మీ మంత్రం పఠించినా....

మేషం : వ్యాపారాలు దీర్ఘకాలిక పెట్టుబడుల ఆలోచన వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులు, సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నూతన పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. 
 
వృషభం : ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, పనిభారం, అదనపు బాధ్యతలు వంటి పరిణామాలుంటాయి. ఏజెంట్లు, బ్రోకర్ల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయడం మంచిది. ఖర్చులు అధికారం. ఫ్యాన్సీ, కిళ్లీ, కిరాణా రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది. 
 
మిథునం : వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి. వాణిజ్య ఒప్పందాలు, అగ్రిమెంట్ల విషయంలో పునరాలోచన అవసరం. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. భాగస్వామిక చర్చల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు పరిచయంలేని వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. 
 
కర్కాటకం : విద్యార్థులకు సన్నిహితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. రుణాలు కోసం అన్వేషఇస్తారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి సామాన్యం. వస్త్రం, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు శ్రమాధిక్యత కానవచ్చిన సత్ఫలితాలు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్పెక్యులేషన్ లాభదాకయం. 
 
సింహం : వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సన్నిహితుల సహాయ సహకారాలు లభించగలవు. వాగ్వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఖర్చులు అవసరాలు పెరగడంతో అదనపు రాబడికై యత్నిస్తారు. 
 
కన్య : బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు శుభదాయంగా ఉంటుంది. అవసరానికి సహకరించని బంధువుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదం చేస్తాయి. 
 
తుల : ఖర్చులు అధికం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. స్థిరబుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచడం ఉత్తమం. ఓర్పు, పట్టుదలతో శ్రమించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాల్లో అమలు చేసిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. 
 
వృశ్చికం : రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికం అవుతున్నారని గమనించండి. ఐరన్, సిమెంట్, కలప, ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. మార్కెటింగ్, ప్రైవేటు, పత్రికా రంగంలోని వారికి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
ధనస్సు : కుటీర పరిశ్రమల వారికి ఆశాజనకం. స్త్రీలతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. 
 
మకరం : స్త్రీలకు అకాలభోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురువుతారు. సయానికి మిత్రులు సహకరించక పోవడంతో అసహనానికి గురవుతారు. మీ వ్యక్తిగత అభిప్రాయాలకు మంచి స్ఫురణ లభిస్తుంది. స్థిరచరాస్తుల క్రయ, విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కుంభం : శ్రీవారు, శ్రీమతికి సంబంధించి ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల శుభం చేకూరగలదు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిదికాదు. గృహ నిర్మాణానికి సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. సన్నిహితుల ఆర్థిక విషయాలలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. 
 
మీనం : ఆర్థిక వ్యవహారాల కారణంగా మనశ్సాంతి లోపిస్తుంది. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. చివరిలో వ్యవహారాలు మందగిస్తాయి. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.