మంగళవారం, 28 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-12-2022 శుక్రవారం దినఫలాలు - కామేశ్వరి దేవిని పూజిస్తే...

Weekly Astrology
మేషం :- విద్యార్థుల్లో మందకొడితనం, ఏకాగ్రత లోపం వంటి చికాకులు చోటుచేసుకుంటాయి. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. వాహనంపై దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. 
 
వృషభం :- పత్రిక, స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనివారితో చికాకులు తప్పవు. వాహన చోదకులకు చికాకులు తప్పవు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. ఉద్యోగస్తుకు రావలసిన క్లయింలు, అలవెన్సులు మంజూరవుతాయి. వృత్తి వ్యాపార, వ్యవహారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. 
 
మిథునం:- కొత్తగా చేపట్టిన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహ మార్పులు, మరమ్మతులు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. దంపతుల మధ్య దాపరికం అనర్థాలకు దారితీస్తుంది. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది.
 
కర్కాటకం :- బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమఫలితం. రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. బంధువులతో తెగిపోయిన సత్సంబంధాలు తిరిగి బలపడతాయి. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు.
 
సింహం :- ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు క్రీడ రంగాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. ఒక కార్యం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తప్పదు. మీ శ్రీమతి సలహాను తేలికగా తీపుకోవటం మంచిది కాదు. కోర్టు వ్యవహారాలు ఒక పట్టాన తేలవు. వ్యాపారాల అభివృద్ధికి పలు పథకాలు అమలు చేస్తారు.
 
కన్య :- వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశంలోని ఆత్మీయుల క్షేమసమాచారం మనశ్శాంతినిస్తుంది. పెద్దమొత్తం సరుకు నిల్వలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. ఉపవాసాలు, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
తుల :- మీ సంతానం కదలికలపై దృష్టి సారించండి. మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల మాటతీరు, పద్ధతి కష్టం కలిగిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలలో పూర్తిచేస్తారు.
 
వృశ్చికం :- వ్యాపారాల్లో ఒక సష్టం మరో విధంగా పూడ్చుకుంటారు. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. చేపట్టిన పనులు బంధువుల కారణంగా అర్ధాంతరంగా ముగించాల్సి వస్తుంది.
 
ధనస్సు :- రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. గృహంలో మార్పులు, చేర్పులకు చేసే యత్నాలు వాయిదాపడతాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. మీపై శకునాలు, చెప్పుడు మాటల ప్రభావం అధికం.
 
మకరం :- చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. బ్యాంకు ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పత్రికా సిబ్బందికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందికి దారితీస్తాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
 
కుంభం :- సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు చురుకుగా సాగుతాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. 
 
మీనం :- ఉపాధ్యాయులు విద్యార్థుల మొండివైఖరి వల్ల సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో చుక్కెదురవుతుంది. సహోద్యోగుల నిర్లక్ష్యం వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.