గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-02-2024 శనివారం మీ రాశిఫలాలు - సత్యనారాయణస్వామిని మీ సంకల్పం...

kanya rashi
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య ఐ|| అష్టమి ప.12.25 విశాఖ రా.2.59 ఉ.వ.7.41 ల 9.22. ఉ.దు. 6.35ల 8.06.
రమాసమేత సత్యనారాయణస్వామిని మీ సంకల్పం సిద్ధిస్తుంది.
 
మేషం :- మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది. ఉద్యోగ, వివాహ యత్నాల్లో సఫలీకృతులవుతారు.
 
వృషభం :- పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. షాపుగుమాస్తాలు, పనివారలకు వస్త్ర ప్రాప్తి, ధనలాభం, విందు భోజనం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
మిథునం :- సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన, విలాసవస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలోవారికి పురోభివృద్ధి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతికి కొంతమంది ఆటంకం కలిగిస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. షాపు గుమాస్తాలు, పనివారలకు వస్త్ర ప్రాప్తి, ధనలాభం, విందు భోజనం.
 
సింహం :- వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. దూర ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. ఒక వేడుకను ఘనంగా చేయటానికి సన్నాహాలు మొదలెడతారు. వాహనం నడుపతున్నపుడు మెలకువ వహించండి. స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం, పనితనానికి మంచి గుర్తింపులభిస్తాయి.
 
కన్య :- వ్యవసాయ, తోటల రంగాల వారికి సామాన్యం. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. పారిశ్రామిక రంగాల వారికి ఊహించని చికాకులెదురువుతాయి.
 
తుల :- ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. గృహ నిర్మాణంలో మెళకువ వహించండి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవు.
 
వృశ్చికం :- స్థిరచరాస్తుల క్రయ విక్రయాల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. దైవకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని వ్యవహరాలు అనుకూలించటంతో మానసికంగా కుదుటపడతారు.
 
ధనస్సు :- శారీరకశ్రమ, మానసిక ఒత్తిళ్ళ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వల్ల కించిత్ ఇబ్బందులెదుర్కుంటారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం.
 
మకరం :- ఆర్థిక వ్యవహారాలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రైవేటు సంస్థలో మదుపు చేయాలన్న మీ ఆలోచన విరమించుకోవటం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆకస్మిక సమస్యలు తలెత్తినా తెలివిగా పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులు, అధికారులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటంశ్రేయస్కరం.
 
కుంభం :- ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతంత మాత్రంగానే ఉంటుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, వ్యాపకాలు అధికమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి పురోభివృద్ధి. తలచినపనుల్లో జయం వంటి శుభ సూచకాలున్నాయి. ఊహించని ఖర్చులు, చెల్లింపులవల్ల కించిత్ ఇబ్బందులు ఎదుర్కుంటారు.
 
మీనం :- మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని అనుకున్న పనులు పూర్తికావు. విద్యార్థులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీపై సెంటిమెంట్లు, దుశ్శకునాల ప్రభావం అధికంగా ఉంటుంది. వ్యాపార రంగాల వారికి దస్త్రం ముహూర్తం నిర్ణయిస్తారు.