శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 03-03-2023 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం..

Aquarius
మేషం :- రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన ఒత్తిడి, చికాకులు అధిమవుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. విందు, వినోదాలలో పరిమితి పాటించండి. సన్నిహితులతో ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదు.
 
వృషభం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించ గలదు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. సోదరీ, సోదరులు సన్నిహితులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి.
 
మిథునం :- షామియాన, సప్లయ్ రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులవల్ల ఒత్తిడి పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. స్త్రీలకు విదేశీ వస్తువులపై ఆకర్షితులవుతారు. స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం.
 
కర్కాటకం :- ఖర్చులు అధికం కావడంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుండో ఆగి వున్న పనులు పునఃప్రారంభమవుతాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. 
 
సింహం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రేమికుల ఆలోచనలు పెడదోవ పట్టే ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
కన్య :- కార్యసాధనలో ఆటంకాలెదురైనా ఆత్మ స్థైర్యంతో అడుగు ముందుకేయండి. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి పనిభారం అధికం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. మీపై శకునాలు, పట్టింపులు తీవ్రప్రభావం చూపుతాయి. బంధుమిత్రులతో కలసి విందు, వినోదాలు పాల్గొంటారు. 
 
తుల :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. గృహోకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. రవాణా రంగాలలోని వారికిచికులు అధికమవుతాయి. చేతివృత్తుల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు.
 
వృశ్చికం :- రాజకీయ రంగాల్లో వారికి అప్రమత్తత అవసరం. దూర ప్రయాణాలలో నూతన వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. క్రీడలపట్ల ఆసక్తి అధికమవుతుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించడంవల్ల సమస్యలు తప్పవు. వ్యాపారాలలో ఆటంకాలు అధికంగమించి అనుభవం గడిస్తారు. దైవ కార్యాలు మానసిక ప్రశాంతతనిస్తాయి.
 
ధనస్సు :- వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు చేపడతారు. అధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంవల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు చదువులపట్ల ఏకాగ్రత చాలా అవసరం. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కుటుంబీకుల కోసం విరివిగా ధనం వ్యయం చేస్తారు.
 
మకరం :- కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి నాందీ పలుకుతాయి. బంధువుల రాక అందరికీ సంతోషం కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి ఆందోళనలు అధికమవుతాయి. రుణ, విదేశీ యత్నాల్లో ఊహించని ఆటంకాలు ఎదుర్కుంటారు. 
 
కుంభం :- రావలసిన ధనం వాయిదా పడుతుంది. రవాణా రంగాల వారికి ఏకాగ్రత అసవరం. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి సలహా పాటింటం శ్రేయస్కరం. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మీనం :- ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. అనువు కాని చోట ఆధిపత్యం చెలాయించటం మంచిది కాదు. సోదరీ, సోదరులతో మనస్పర్ధలు తలెత్తుతాయి. నూతన ప్రదేశ సందర్శనలు, పుణ్యక్షేత్రాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.