శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-10-2023 గురువారం రాశిఫలాలు - సాయిబాబా గుడిలో అన్నదానం చేసిన శుభం...

Mesha Raashi
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద బ|| షష్ఠి ఉ.8.47 మృగశిర రా.11.28 ఉ.శే.వ. 6.07 కు ఉ. దు. 9.50 ల 10.38 ప.దు. 2.35ల 3.22.
సాయిబాబా గుడిలో అన్నదానం చేసిన శుభం జయం పొందుతారు.
 
 
Daily Horoscope, Daily Astrology, Daily Predictions, Today Astro, January, February, March, April, May, June, July August, September, October, November, December, రాశిఫలాలు, దినఫలాలు, ఆస్ట్రాలజీ, భవిష్యవాణి, రోజువారీ రాశిఫలాలు, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం 
 
మేషం :- ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయం లోపిస్తుంది. మీ సంతానం కోసం కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. గృహంలో మార్పులకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. దంపతుల మధ్య కలహం తలెత్తుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది.
 
వృషభం :- ఉమ్మడి వ్యాపారాలు, నూతన పెట్టుబడుల ఆలోచన వాయిదావేయండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పని భారం అధికమవుతుంది. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి నాందీ పలుకుతాయి.
 
మిథునం :- స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. మిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసివస్తుంది. కళ్యాణ మండపాల కోసం అన్వేషణ సాగిస్తారు. లాయర్లకు రాణింపు ఇతరుల వివాదాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.
 
కర్కాటకం :- నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. రాజకీయ కళా రంగాల వారికి ప్రోత్సహకరం. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికం. కొన్ని బంధాలు మీకు అనుకూలంగా మారి మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి. మిత్రుల సహకారంతో ఓ సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు.
 
సింహం :- ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల అలసట అధికమవుతుంది. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. దంపతుల మధ్య కలహాలు, చికాకులు చోటుచేసుకుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
కన్య :- నూతన పరిచయాలు వ్యాపకాలు కొత్త ఉత్సాహం కలిగిస్తాయి. అలవాటు లేని పనులు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. విద్యార్థులు స్వయం కృషితో రాణిస్తారు. కార్యాలయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
 
తుల :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్లు నిరుత్సాహం కలిగిస్తాయి. వాహనం కొనుగోలుకై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- వ్యాపారాల్లో పోటీ, పనివారలతో చికాకులు ఎదుర్కుంటారు. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. రుణం తీర్చటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు రంగాలలో వారికి సామాన్యంగా ఉంటుంది. ఒక స్థిరాస్తి కొనుగోలుకు యత్నాలు సాగిస్తారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు.
 
ధనస్సు :- హోల్‌‍సేల్, రిటైల్ పెద్దమొత్తం స్టాక్‌లో అప్రమత్తంగా ఉండాలి. వేధింపుల అధికారి బదిలీ వార్త ఉద్యోగస్తులకు సంతోషం కలిగిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగాలలో వారికి అనుకూలమైనకాలం.
 
మకరం :- ప్రముఖుల సిఫార్సుతో కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ అంచనాలు, పథకాలు బెడిసికొట్టే ఆస్కారం ఉంది. పట్టువిడుపు ధోరణితో సమస్యలు పరిష్కారమవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
కుంభం :- పీచు, ఫోం, లెదర్, ఫర్నీచర్ వ్యాపారులకు కలిసిరాగలదు. ఉపాధ్యాయులు సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తప్పవు. మీ కుటుంబీకుల మొండితనం, పట్టుదల వల్ల ఒకింత అసహనానికి గురవుతారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం.
 
మీనం :- వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. చేపట్టే కార్యక్రమాల్లో ఒడిదుడుకులు తప్పవు. తమ మాటే నెగ్గాలన్నపంతం ఇరువురికి తగదు. గౌరవప్రదమైన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి.