సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-07-2024 ఆదివారం దినఫలాలు - శతృవులపై విజయం సాధిస్తారు...

Astrology
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ శు॥ విదియ తె.4.25 పుష్యమి పూర్తి ప.వ.1.29 ల3.09. సా.దు. 4.50ల 5.42. 
 
మేషం :- స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటు తగదు. బంధువుల ఆకస్మిక రాక వల్ల ఖర్చులు అధికమవుతాయి. అందరితో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం :- కుటుంబీకుల మొండివైఖరి అసహనం కలిగిస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షణ తప్పదు. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. సంతానం పై చదువులకు కావలసిన ధనం సర్దుబాటు చేసుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలపై మీ ఆలోచనలుంటాయి. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
మిథునం :- మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. దైవ కార్యంలో పాల్గొంటారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. కుటుంబీకుల మొండివైఖరి అసహనం కలిగిస్తుంది. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి.
 
కర్కాటకం :- స్త్రీలకు ఆరోగ్య భంగం, వైద్యసేవలు అవసరం. పెద్దమొత్తం ధన సహాయం క్షేమం కాదు. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించేవారుండరు. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. సంతానం పై చదువుల కోసం చేసే యత్నం ఫలిస్తుంది.
 
సింహం :- కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. పనులు మొదలెట్టే సమయానికి ఆటంకాలెదురవుతాయి. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కుంటారు.
 
కన్య :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలోజయం చేకూరుతుంది. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎందుర్కొంటారు. సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి.
 
తుల :- ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. వ్యాపారాల్లో నష్టాలను పూడ్చుకుంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల కోసం షాపింగులు చేస్తారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
వృశ్చికం :- సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ ఇష్టాయి ష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. కొన్ని విషయాలను చూసీ చూడనట్టుగాఉండాలి.
 
ధనస్సు :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత, సహనం ఎంతో ముఖ్యం. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడతాయి. మీ చుట్టు ప్రక్కల వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం. సోదరుని వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
మకరం :- రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులను ఎదుర్కొంటారు. మీ మంచి తనమే మీకు శ్రీరామ రక్ష. మీ పరోపకార బుద్ధి మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. స్త్రీలు గృహమునకు కావలసిన వస్తువుల కోసం ధనం ఖర్చుచేస్తారు. రాజకీయాలలోని వారికి ఒక సమాచారం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
 
కుంభం :- వ్యాపారాల్లో మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తారు. రాజకీయాలలో వారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి. సమయానికి మిత్రులు సహకరించక పోవటంతో అసహనానికి గురవుతారు. ఆత్మీయులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలకు విఘాతం కలిగే అవకాశంఉంది. చేతి వృత్తుల వారికి ఇబ్బందులుతప్పవు.
 
మీనం :- ఆర్థిక వ్యవహరాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. మీ సంతానంతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభంకాగలవు. దూరప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనలకు అనుకూలం. స్త్రీల ఆరోగ్య విషయంలో కొంత మెళుకువ వహించండి.