ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 10-02-2023 శుక్రవారం దినఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించడం...

Capricorn
మేషం :- రవాణా రంగాలవారికి ప్రయాణీకులతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీల అనాలోచిత నిర్ణయాలు, ఆగ్రహావేశాల వల్ల కుటుంబంలో చికాకులు, కలహాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదావకాశాలు లభిస్తాయి. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది.
 
వృషభం :- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. 
 
మిథునం :- మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థినులకు ఒత్తిడి, ఆందోళనలు ఎదుర్కొంటారు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. 
 
కర్కాటకం :- స్త్రీలు కళ్ళు, తల, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించడం వల్ల కొన్ని పనులు సానుకూలమవుతాయి.
 
సింహం :- ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. పెద్దల ఆరోగ్యములో మెళుకు చాలా అవసరం. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది. విద్యార్థులకు ఒత్తిడి, అవిశ్రాంతంగా శ్రమించాల్సి ఉంటుంది.
 
కన్య :- మీ సంతానం మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. పెద్దలను నుంచి అవమానాలు తప్పవు. రుణం తీర్చటానికై చేయుయత్నం వాయిదా పడుతుంది. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించ లేకపోతారు. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. దూరప్రయాణాలలో కొత్త పరిచయా లేర్పతాయి.
 
తుల :- వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. వాతావరణంలో మార్పుతో స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేయవలసి వస్తుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
వృశ్చికం :- ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. బంధుమిత్రుల ఆకస్మిక రాకఇబ్బంది కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదం చేస్తాయి. ఉద్యోగస్తులకు స్థానచలనం, బాధ్యతల మార్పు నిరుత్సాహం కలిగిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఉపాధి పథకాలకు మంచిస్పందన లభిస్తుంది.
 
ధనస్సు :- అధికారులతో సంభాషించేటపుడు మెళుకువ అవసరం. రాజకీయ నాయకులకు పదవులందు అనేక మార్పులు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి.
 
మకరం :- వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. మీ పై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. దంపతుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. విద్యార్థుల్లో ఏకాగ్రత, మనోధైర్యం నెలకొంటాయి.
 
కుంభం :- ఆకస్మిక ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారంతోమీలో కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటాయి. సోదరీ సోదరుల మధ్య పరస్పర అవగాహనకుదరదు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. బంధువుల కలయికతో గతానుభవాలు జ్ఞప్తికి రాగలవు. మీ సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు.
 
మీనం :- ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. కిరణా,ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు. స్త్రీల తొందరపాటుతనానికి ఊహించని చికాకులు తలెత్తవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి.