ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-11-2023 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం...

Shukra Vakri 2023
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక శు॥ చవితి ఉ.11.31 పూర్వాషాఢ రా.2.30ప.వ.12.39 ల 2.12. ఉ. దు. 8. 19 ల 9.05 ప. దు. 12.07 ల 12.52.
లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- మీ బంధవులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ప్రతి వ్యవహారం మీరే నిర్వహించుకోవటం మంచిది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరీసోదరులతో ఒక అవగాహన కుదుర్చుకుంటారు. నిరుద్యోగులకు, ప్రింటింగ్ స్టేషనరీ రంగాల వారు చికాకులను ఎదుర్కొంటారు.
 
వృషభం :- దైవ, పుణ్య సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. ప్రతి చిన్న పని మీరే చేసుకోవలసివస్తుంది. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. హోల్సేల్ వ్యాపారులు పెద్ద మొత్తంలో చెక్కుల జారీలో ఏకాగ్రత వహించాలి.
 
మిథునం :- ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. కొంతమంది మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ధి పొందటానికి యత్నిస్తారు జాగ్రత్త వహించండి. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచన లుంటాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలోని వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు తోటివారి ద్వారా శుభవార్తలు వింటారు.
 
కర్కాటకం :- గృహానికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ అంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు పురోభివృద్ధి. రిప్రజెంటివ్‌లకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి.
 
సింహం :- ఎప్పటి నుంచోవాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి కాగలవు. పోగొట్టుకున్న వస్తువులు అతికష్టంమ్మీద రాబట్టుకుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కీలకమైన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయం మీ శ్రీమతికి నచ్చదు.
 
కన్య :- ఆపద సమయంలో బంధుమిత్రులు అండగా నిలుస్తారు. దంపతుల మధ్య అపోహలు తొలగి అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. రాజకీయనాయకులు సభ, సమావేశాలో చురుకుగా పాల్గొంటారు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకం. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.
 
తుల :- బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలతో అతిగా సంభాషించటం వల్ల అపార్ధాలకు గురికావలసి వస్తుంది. పొగాకు, ప్రత్తి రంగాలలో వారికి కలిసి వచ్చేకాలం. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఉపాధ్యాయులు, తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
వృశ్చికం :- రవాణా రంగాలలోని వారికి ఏకాగ్రత చాలా అవసరం. మీపై ఆధారపడిన వారి పట్ల విజ్ఞతాయుతంగా మెలగండి, సమస్యలు అవే సర్దుకుంటాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
 
ధనస్సు :- విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు తొలిపోగలవు. ప్రభుత్వపరంగా రుణమాఫీలు, సబ్సిడీలు అధికంగా ఉంటాయి. స్త్రీలు ఉపవాసాలు, శ్రమాధిక్యత కారణంగా స్వల్ప అస్వస్థతకు గురవుతారు. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. దైవదీక్షలు స్వీకరిస్తారు.
 
మకరం :- ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. శత్రువులు మిత్రులుగా మారిమీకు సహాయాన్ని అందిస్తారు. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఖర్చులు ఊహించనవే కావటంతో పెద్దగా ఇబ్బందులుండవు. బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది.
 
కుంభం :- హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందు లెదుర్కుంటారు. మీ గౌరవ ప్రతిష్టకు భంగం కలుగకుండా వ్యవహరించండి. దైవ కార్యక్రమాల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
మీనం :- సినీ కళాకారుల వల్ల రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. బంధులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. ఇతరుల సాయం కోసం ఎదురు చూడకుండా మీ యత్నాలు సాగించండి.