మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-11-2024 బుధవారం ఫలితాలు - గృహం ప్రశాంతంగా ఉంటుంది...

astro11
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. కీలక పత్రాలు అందుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు, పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఉల్లాసంగా గడుపుతారు. గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ధపలాభం ఉంది. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో జాప్యం తగదు. అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు, వస్తువులు లభ్యమవుతాయి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఏకాగ్రతతో వ్యవహరించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితులు సాయం అందిస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. విశ్రాంతి లోపం, అకాలభోజనం. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పాతమిత్రులు తారసపడతారు. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. యత్నాలకు అదృష్టం కలిసివస్తుంది. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. పనులు పురమాయించవద్దు. స్థిరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాగ్రత్త. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. సోదరుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు కలిసివస్తాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పనులు త్వరితగతిన పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విందులు, వేడుకలకు హాజరవుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీల్లో తప్పటడుగు వేస్తారు. కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. అన్యమస్కంగా గడుపుతారు. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. ఖర్చులు అధికం. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులకు చేరువవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులతో జాగ్రత్త. పొగిడేవారి ఆంతర్యం గ్రహించండి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారితో సంభాషిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.