శనివారం, 4 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-08-2024 - శుక్రవారం మీ రాశి ఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత..?

Astrology
శ్రీ క్రోధినామ సం|| శ్రావణ బ|| చవితి ప.3.29 రేవతి రా.1.36 ప.వ.2.26 ల 3.55. ఉ.దు. 8.15 ల 9.06 ప. దు. 12. 31 ల 1.22.
 
మేషం: - వృత్తి వ్యాపారులు ఊహించి చికాకులు, సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ సంతానం భవిష్యత్తు గురించి కొత్త పథకాలు వేస్తారు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. శ్రీవారు-శ్రీమతిల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. 
 
వృషభం:- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఫైనాన్సు, చిట్ ఫండ్ రంగాలలో వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. రవాణా రంగాలలో వారికి మిశ్రమ ఫలితం కానవస్తుంది. మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. 
 
మిధునం: ఆర్థికంగా బలం చేకూరుతుంది. స్త్రీలకు అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకం. మీ అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం:- ఉద్యోగస్తులకు హోదాతో పాటు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. ప్రియతముల ఆకస్మిక రాక ఆశ్చర్యానందాలు కలిగిస్తాయి. ఎల్.ఐ.సి., పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళన తప్పదు. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
 
సింహం:- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. ముఖ్యమై వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ఇరుగు పొరుగు వారి వైఖరివల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత అవసరం. సన్నిహితులతో విభేదాలు పరిష్కారమవుతాయి. 
 
కన్య:- ఆర్ధిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు శుభదాయకం. కుటుంబం కోసం మరింత సమయాన్ని వెచ్చించండి. అసలైన శక్తి సామర్థ్యన్ని మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. దిన చర్యలో కొత్త ప్రణాళికలు చోటుచేసుకుంటాయి.
 
తుల:- ఔదార్యమున్న స్నేహితులు మీ ఆర్థికావసరాలకు అందివస్తారు. సొంత ఊరి జ్ఞాపకాలు మీలో ఆనందాన్ని కలిగిస్తాయి. గత శ్రమకు ఫలితం దక్కుతుంది. భాగస్వామ్యాలు కలిసిరాకపోవచ్చు. బంధువుల వైఖరిలో అనుకోని మార్పులు జరిగి, మరింత దగ్గరవుతారు. విద్యార్థులు భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలి.
 
వృశ్చికం:- ఆర్ధిక పరిస్థితి చక్కబడేవరకు ధనాన్ని కూడబెట్టడం మంచిది. రచయితలు, కళ, క్రీడాకారులకు ఆదరణ లభిస్తుంది. గృహమునకు చిన్న చిన్న మరమ్మత్తులు చేయించే అవకాశం ఉంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి.
 
ధనస్సు:- ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. స్త్రీలకు బంధు వర్గాల నుంచి ఆహ్వానాలు లభిస్తాయి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.
 
మకరం: వస్త్ర, బంగారు, వెండి విలువైన వస్తువులను అమర్చుకుంటారు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. రావలసిన బాకీలు సైతం వసూలు కాగలవు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం.
 
కుంభం:- డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టే ముందు జాగ్రత్త అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. మీరంటే అసూయపడే ఒకరి ద్వారా అనవసర చిక్కుల్లో పడవచ్చు. మరిన్ని కొత్త ప్రాజెక్టులు సొంతం చేసుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు అన్ని క్షుణంగా పరిశీలించండి. చెడు స్నేహాలు వదలడం వల్ల అభివృద్ధి సాధిస్తారు. 
 
మీనం:- కొత్త పరిశ్రమలు, వ్యాపారాలకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. ఒక వ్యవహారం నిమిత్త ప్రయాణాలు చేయవలసివస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.