శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-10-2022 సోమవారం దినఫలాలు - సదాశివుని నీలపు శంఖు పూలతో ఆరాధించిన...

Astrology
మేషం :- ఆర్థిక లావాదేవీలు, ముఖ్యమైన చర్చలు సజావుగా సాగుతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. ప్రారంభోత్సవాలు, సంస్థల స్థాపనలకు యత్నాలు సాగిస్తారు. వృత్తుల వారికి అన్ని విధాల కలిసిరాగలదు. లీజు, ఏజెన్సీలు, విషయమై ఒక నిర్ణయానికి వస్తారు.
 
వృషభం :- గృహనిర్మాణాలు, మరమ్మత్తులు అనుకూలిస్తాయి. బంధు మిత్రుల రాకపోకల వలన ఒకింత ఖర్చులు తప్పవు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు అడ్వాన్సులు, క్లైయింలు, ఇతర అలవెన్సులు, అందుతాయి. కోర్టు వ్యవహరాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి.
 
మిథునం :- కొత్త ప్రదేశాలు, పుణ్యక్షేత్ర సందర్శనలకు అనుకూలం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఏ వ్యక్తిని అతిగా విశ్వసించడం మంచిదికాదు. ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత వహించండి. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ విషయంలో వివాదాలు తలెత్తే ఆస్కారం ఉంది.
 
కర్కాటకం :- ప్రింటింగ్, పత్రికా సిబ్బందికి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది. ఆత్మీయుల కలయికతో మానసిక సంతృప్తి పొందుతారు. ప్రయాణాలు వాయిదాపడతాయి.
 
సింహం :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ మాటకు సంఘంలోను, కుటుంబంలోను గౌరవం లభిస్తుంది. దుబారా ఖర్చులు అధికం. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. విద్యార్థినుల్లో ఉత్సాహం నెలకొంటుంది.
 
కన్య :- ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించే వారుండరు. ప్రయాణాల్లో ఒకింత అనారోగ్యం, అసౌకర్యానికి గురవుతారు. స్త్రీలకు ఆకస్మిక ధనప్రాప్తి వస్త్ర, వస్తులాభం వంటి శుభపరిణామాలుంటాయి. కళ, క్రీడ, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
తుల :- నిత్యావసర వస్తువుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకస్మిక ఖర్చులు మీద పడటంతో ఒకింత ఒడిదుడుకులు తప్పవు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. విద్యార్థులలో నూతన ఉత్సాహం నెలకొంటుంది. స్థిరాస్తి వ్యవహరాలు ఒక కొలిక్కిరాగలవు. దైవ, పుణ్య, సేవా కార్యాలకు హితోధికంగా సహకరిస్తారు.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో అప్రమత్తత అవసరం. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ప్రదేశ సందర్శనలకు యత్నాలు మొదలెడతారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. మీ పిల్లల ప్రతిభ సంతోషం కలిగిస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకునే దిశగా మీ ఆలోచనలుంటాయి.
 
ధనస్సు :- ఉమ్మడి వ్యాపారాలకు సంబంధించిన చర్చలు కొలిక్కి రాగలవు. ప్రింటింగ్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. దైవ కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఇతరులతో లౌక్యంగా వ్యవహరించడం మంచిది. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు.
 
మకరం :- నిరుద్యోగులకు ప్రకటనలు, కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. దైవసేవా కార్యాలకు సహాయ సహకారాలందిస్తారు. రుణయత్నాల్లో పురోగతి ఉంటుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. మీ మాటకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది.
 
కుంభం :- ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి మార్పులు వాయిదా పడతాయి. చిట్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి. మీ వ్యక్తిత్వం కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు.
 
మీనం :- దైవ కార్యాల పట్ల ఆకర్షితులవుతారు. కోర్టు వ్యవహరాలు ముందుకు సాగవు. క్రయ, విక్రయాలు సామాన్యం. నూతన వ్యాపారాలు ప్రగతిపథంలో సాగుతాయి. సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో అప్రమత్తత అవసరం. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి.