గురువారం, 14 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-09-2024 శనివారం దినఫలితాలు : నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది...

astrolgy
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగించండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక వీలుపడదు. వ్యాపారాలపై దృష్టి సారిస్తారు. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉపాధ్యాయులకు ఏకాగ్ర, సమయపాలన ప్రధానం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఓర్పునకు పరీక్షా సమయం. కష్టాలకు కుంగిపోవద్దు. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. ఖర్చులు అధికం. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కష్టసమయం. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణ సమస్యలు తొలగుతాయి. తాకట్టు విడిపించుకుంటారు. పథకాలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పరిచయాలు బలపడతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. అవతలి వారి స్థోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. నోటీసులు అందుతాయి. సోదరులను సంప్రదిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు భారమనిపించవు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆహ్వానం అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఊహించని సమస్యలు, చేపట్టిన పనుల్లో ఆటంకాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వాక్చాతుర్యంతో రాణిస్తారు. మీ కష్టం వృధా కాదు. ప్రత్యేక గుర్తింపు పొందుతారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆహ్వానం అందుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. ఉన్నతాధికారులకు స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగాసాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. చిన్న విషయానికే ఉద్రేకపడతారు. పంతాలకు పోవద్దు. స్నేహితులే వ్యతిరేకులవుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. ఖర్చులు సామాన్యం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. సంతానం కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులు ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి.