శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-07-2024 మంగళవారం దినఫలాలు - ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు...

Mesha Raashi
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ ఐ|| దశమి రా. 6.53 కృత్తిక ప.1.25 తె.వ.4.52 ల ఉ. దు. 8.09ల 9.01 రా. దు. 10.57 ల 11.41.
 
మేషం :- కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు ఫలిస్తాయి. ఊహించని ఖర్చులు చికాకు పరుస్తాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. కళా, సాంస్కృతిక, బోధన, విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సహకరంగా ఉంటుంది. పాత బాకీలు, బిల్లులు చెల్లిస్తారు. 
 
వృషభం :- ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. సహోద్యోగులతో వ్యక్తిగత విషయాలు చర్చకు వస్తాయి. రావలసిన ధనం చేతికందటంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. తెలివి తేటలతో వ్యవహారించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళుకువ వహించండి.
 
మిథునం :- ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహనకు వస్తారు. వడ్డీలు, డిపాజిట్లు అందుకుంటారు. భాగస్వామిక ఒప్పందాలు, ప్రముఖులతో చర్చలు సత్ఫలితాలిస్తాయి. కార్యసాధనలో ఓర్పు పట్టుదల అవసరం. నిరుద్యోగులలో నూతనోత్సహం చోటుచేసుకుంటుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం :- శ్రీవారు, శ్రీమతికి సంబంధించి ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. పెద్దల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసే వారు మీ సహాయం అర్థిస్తారు. ఫీజులు చెల్లిస్తారు.
 
సింహం :- మీ సంతానం కోసం ధనంవిరివిగా వ్యయం చేస్తారు. పాత సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక విషయాలలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు. నిరుద్యోగులలో ఉద్యోగావకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతారు.
 
కన్య :- కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేస్తారు. వ్యవసాయ రంగాల వారికి విత్తనాల కొనుగోలు విషయంలో మెళుకువ అవసరం. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తంగా మెలగండి. పెన్షన్, భీమా పనులు పూర్తవుతాయి.
 
తుల :- ప్రకటనలు, న్యాయ, బోధనారంగాల వారికి అనుకూలం. గృహావసరాలకు నిధులు సమకూరుతాయి. బంధువులను కలుసుకుంటారు. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. ప్రత్యర్థుల కదలిక పట్ల ఓ కన్నేసి ఉంచండి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటాయి.
 
వృశ్చికం :- మీ మాటకు సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడికై యత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. వాహనం నడుపుతున్నపుడు మెళుకువ వహించండి. పెంపుడు జంతువుల విషయంలో మెళుకువ అవసరం.
 
ధనస్సు :- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. చిన్నారుల విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలలో ఖర్చులు అంచనాలు మించుతాయి. ముఖ్యంగా ప్రింట్, మిడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఉమ్మడి నిధుల నిర్వాహణలో ఇబ్బందులు ఎదురవుతాయి.
 
మకరం :- గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి ఓసమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. సోదరి, సోదరుల మధ్య మనస్ఫర్థలు తలెత్తుతాయి. కోర్టు పనులు, లిటిగేషన్లు పరిష్కారం అవుతాయి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు.
 
కుంభం :- ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ వంటి శుభవార్తలు అందుతాయి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. స్పెక్యులేషన్లు, పోటీల్లో నష్టం సంభవం. ప్రత్యర్ధులు మీ శక్తిసామర్ధ్యాలను గుర్తిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి.
 
మీనం :- తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవటం క్షేమం కాదు. దైవదర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరదు.