గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 నవంబరు 2024 (22:33 IST)

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

indian railway
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ రాష్ట్రంలోని కాజీపేటలో రైలు పెట్టెల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా, ఈ రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం కాజీపేటలో ఉన్న ఓవర్ హాలింగ్ వర్క్ షాపును మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్ గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
అప్‌గ్రేడ్ చేయాలని గత యేడాది జూలై 5వ తేదీన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు రైల్వే బోర్డు లేఖ రాసింది. అప్‌గ్రేడ్ చేసిన యూనిట్‌లో ఎల్.హెచ్.బి, ఈఎంయూ కోచ్‌లను తయారు చేసేందుకు అనుగుణంగా యూనిట్‌ని అభివృద్ధి చేయడానికి ఈ యేడాది సెప్టెంబరు 9 తేదీన రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది.