సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

31-08-2024 శనివారం రాశిఫలాలు - పాతమిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది...

astrolgy
శ్రీ క్రోధినామ సం|| శ్రావణ బ|| త్రయోదశి తె.3.58 పుష్యమి రా.9.20 ఉ.శే.వ. 6.23 కు. ఉ.దు.5.42 ల 7.24.
 
మేషం :- దైవ, సేవా, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. సొంతంగా వ్యాపారం చేయాలనే దృక్పధం బలపడుతుంది. పాతమిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. గృహ నిర్మాణాలు, మర్మతులు మందకొడిగా సాగుతాయి.
 
వృషభం :- సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. ఎదుటివారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు యత్నించండి. వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో తొందరపాటు తగదు. సోదరీ సోదరులతో విభేదిస్తారు. 
 
మిథునం :- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు శుభదాయకం. దుబారా ఖర్చులు అధికమవుతాయి. యాదృచ్ఛికంగా తప్పిదాలు జరిగే ఆస్కారం ఉంది. ఎరువుల వ్యాపారులకు కొత్త సమస్యలుతలెత్తే సూచనలున్నాయి. వాహనచోదకులకు చికాకులు తప్పవు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం.
 
కర్కాటకం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. మీ అభిప్రాయాల వ్యక్తీకరణకు సమయం కలిసివస్తుంది. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. యూనియన్ వ్యవహారాల నుంచి తప్పుకుంటారు.
 
సింహం :- స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది. మిమ్ములను వ్యతిరేకించిన వారిని సైతం మీ వైపునకు తిప్పుకోగల్గుతారు. కొన్ని పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది.
 
కన్య :- క్యాటరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. చిన్న చిన్న విషయాలను అంతగా పట్టించుకోవద్దు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, విలాసవస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రావలసిన ధనం కోసం యత్నాలు సాగిస్తారు.
 
తుల :- పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. నిరుద్యోగులకు అపరిచిత వ్యకుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. శనగ, చింతపండు, నూనెలు స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. క్రయ విక్రయాలు సంతృప్తిని ఇస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
వృశ్చికం :- ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. స్త్రీల మనోభావాలకు గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఉద్యోగస్తులు సభ, సమావేశాలలో పాల్గొంటారు.
 
ధనస్సు :- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ప్రతి స్వల్ప విషయానికి అసహనం ప్రదర్శిస్తారు. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు.
 
మకరం :- బంధువుల రాక పోకలు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం.వృత్తి, ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. పెద్దల ఆశీస్సులు, ప్రశంసలు లభిస్తాయి. పెద్దల ఆశీస్సులు, ప్రశంసలు లభిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఓర్పు, పట్టుదలతో ఉద్యోగయత్నం సాగించాలి.
 
కుంభం :- బంధు మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. దూర ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు గడిస్తారు. పాత వస్తువులను కొనిఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
మీనం :- ఆర్థికస్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. దంపతుల మధ్య అరమరికలు తగవు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆటుపోట్లు తప్పవు. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఆస్తి వ్యవహారాలుఒక కొలిక్కి వస్తాయి. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. స్త్రీల ఆరోగ్యములో మెళుకువ అవసరం.