మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-04-22 ఆదివారం రాశిఫలాలు - సీతారాములను పున్నాగ పూలతో పూజించిన...

మేషం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత, మెళుకువ చాలా వహించండి. ఊహించని ఖర్యులు అధికం.
 
వృషభం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు, మార్కెట్ రంగాల వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
మిథునం :- దైవ, సేవా కార్యక్రమాలకు ఇతోధికంగా సహకరిస్తారు. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కీలకమైన వ్యవహారాల్లో జయం, మొండి బాకీల వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి.
 
కర్కాటకం :- ఆర్థిక స్థితి మునుపటి కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కని పెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
సింహం :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయటం వలన ఆశాంతికి లోనవుతారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
కన్య :- ఆలయ సందర్శనాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. ఆప్తుల రాకతో గృహం సందడిగా ఉంటుంది.
 
తుల :- కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ది కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చుకానీ మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబసభ్యులు మసలుకుంటారు. 
 
వృశ్చికం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. మీ సంతానం ఉన్నతి కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఒక వ్యవహారం నిమిత్తం బాగా శ్రమించాల్సి ఉంటుంది. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి.
 
ధనస్సు :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఏ మాత్రం పొదుపు సాధ్యం కాదు.
 
మకరం :- మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. మీ బంధవులను సహాయం అగ్గించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. వ్యారారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు.
 
కుంభం :- కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. ఉన్నతస్థాయి అధికారులకు ఒత్తిడి, కిందిస్థాయి సిబ్బందితో చికాకులు తప్పవు. చిట్స్, ఫైనాన్సు సంస్థలల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి.
 
మీనం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం.