సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-05-22 గురువారం రాశిఫలాలు ... వినాయకుడిని ఆరాధించిన సంకల్పసిద్ధి..

astro12
మేషం :- ట్రాన్సుపోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. గత విషయాలు జప్తికి రాగలవు. కుటుంబంలో స్త్రీల మాటకు మంచి స్పందన లభిస్తుంది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది.
 
వృషభం :- ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకునే యత్నంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. స్త్రీలు ఒత్తిళ్ళు, మొహమ్మాటాలకు పోవడం వల్ల సమస్యలు తప్పవు. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి.
 
మిథునం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
కర్కాటకం :- ఆర్థికంగా అభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఉమ్మడి వెంచర్లు, భాగస్వామిక వ్యాపారాల ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయండి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలను ఎదుర్కొంటారు.
 
సింహం :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటుచేసుకుంటాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు.
 
కన్య :- కుటుంబీకులతో ఏకీభవించలేరు. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల వైఖరి ఎంతో నిరుత్సాహ పరుస్తాయి. రాబడికి మించిన ఖర్చులు అధికమవ్వడంవల్ల ఆందోళన చెందుతారు. వృత్తిపరమైన బాధ్యతలు, ప్రజా సంబంధాలు విస్తరిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
తుల :- పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. ఆకస్మిక ఖర్చుల వల్ల ధనం చేతిలో నిలబడటం కష్టం.
 
వృశ్చికం :- ఉపాధ్యాయ దంపతులకు ఒకేచోటికి బదిలీ అవుతుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. తీర్థయాత్రలు, దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. మిత్రులతో రహస్య చర్చలు ఫలిస్తాయి. మీపై శకునాలు, చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది.
 
ధనస్సు :- రుణ బాధలు, ఒత్తిడులు, మానసిక ఆందోళన ఉంటాయి. మీ కళత్ర వైఖరి మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
 
మకరం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. భూములు, స్థలాలు కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలు బంధువుల రాకతో అనుకున్న పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. నిరుద్యోగులకు అన్ని విధాలా కలిసిరాగలదు. కోర్టు పనులు వాయిదా పడటం మంచిదని గమనించండి. ఖర్చులు అధికమవుతాయి.
 
కుంభం :- స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. అధికారులతో కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది.
 
మీనం :- వ్యాపారాభి వృద్ధికి అవిశ్రాంతంగా శ్రమించవలసి ఉంటుంది. ప్రముఖులకు అభినందనలు తెలియజేస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మీ ఉన్నతిని చూచి అసూయపడే వారు అధికమవుతున్నారని గమనించండి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.