గురువారం, 25 జులై 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-11-2021 గురువారం దినఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్పం

మేషం :- వస్త్ర బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారాలు సామాన్యం సందర్భానుసారంగా మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకుంటారు. ఖర్చులు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. నిరుద్యోగులకు సతాకాలం ప్రారంభమవుతుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి.
 
వృషభం :- ఆర్థిక సమస్యలు, కుటుంబంలో చికాకులు సర్దుకుంటాయి. శస్త్రచికిత్సల సమయంలో డాక్టర్లకు ఏకాగ్రత ముఖ్యం. విద్యార్థులలో ఏకాగ్రత, అవగాహన అధికమవుతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి ఒక సమస్యను పరిష్కరిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. ఆహార, వ్యవహారాలు, ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం.
 
మిథునం :- సినీ కళాకారుల వల్ల రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. ధనం చేతికందటంతో పొడుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. పొరుగు దేశాల వల్ల మన దేశానికి సంక్షోభంలో పడే అవకాశం ఉంది. ప్రేమికులకు మధ్య అవగాహనా లోపం వల్ల ఊహించని పరిణామాలు సంభవిస్తాయి. 
 
కర్కాటకం :- భాగస్వామికంగా కంటె సొంత వ్యాపారాలే మీకు అనుకూలిస్తాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు పురోభివృద్ధి, తీర్థయాత్రలు, కొత్త ప్రదేశ సందర్శనలు కొత్త అనుభూతినిస్తాయి. స్త్రీలు వేడుకలు, శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రభుత్వపరంగా రుణమాఫీలు, సబ్సిడీలు అధికంగా ఉంటాయి.
 
సింహం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఏదైనా పరిశ్రమలు, సంస్థలు స్థాపించాలనుకునే మీ ఆశయం త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. బిల్లులు చెల్లిస్తారు. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. స్త్రీలకు కొత్త పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
కన్య :- గృహ నిర్మాణాలు, మరమ్మతులు వాయిదా పడతాయి. రుణయత్నాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల అదనపు పనిభారం తప్పదు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు అనుకూలిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. నూతన దంపతులు కొత్త అనుభూతికి లోనవుతారు.
 
తుల :- పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. నూతన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఆసక్తి సన్నగిల్లి ఇతర వ్యాపకాలు అధికమవుతాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
వృశ్చికం :- కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకం. గృహ మరమ్మతులు, మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత అవసరం. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు.
 
ధనస్సు :- సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. కుటుంబ అవసరాలు పెరగటంతో అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కాంట్రాక్టర్లు, బిల్లర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ముఖ్యం. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి.
 
మకరం :- బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఉపాధ్యాయులకు, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. పాత బకాయిలు వసూలు కాగలవు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
కుంభం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కుప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. స్త్రీలతో అతిగా సంభాషించటం వల్ల అపార్థాలకు గురికావలసి వస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు ఏకాగ్రత అంతగా ఉండదు. సోదరీ, సోదరుల మధ్య ఏకీభావం కుదరదు.
 
మీనం :- స్త్రీలకు హస్త కళలు, సంగీత సాహిత్యాల పట్ల మక్కువ పెరుగుతుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మీ అతిథి మర్యాదలు ఎదుటివారిని సంతృప్తి పరుస్తాయి. వనసమారాధనలు, వేడుకల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఖర్చులు, చెల్లింపుల విషయంలో ఏకాగ్రత వహించండి.