మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-05-22 ఆదివారం రాశిఫలాలు- సూర్యస్తుతితో శుభం

Surya Deva
సూర్య స్తుతి ఆరాధించిన శుభం కలుగుతుంది. 
 
మేషం:- దైవ, సేవా, పుణ్యకార్యాలలో నిమగ్నమవుతారు. రాజకీయ నాయకులు తమ వాగ్దానాలను నిలబెట్టుకోలేక పోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. స్త్రీలకు విలాసవస్తువులు, అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు.
 
వృషభం :- ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబీకులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
మిథునం:- కీలకమైన వ్యవహారాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు ఆటంకాలు తప్పవు. ప్రముఖుల ప్రమేయంతో మీ సమస్య సానుకూలమవుతుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ప్రేమికులు ఉన్న అపార్థాలు తొలగిపోవడంతో ప్రశాంతత చేకూరి ఉల్లాసంగా గడుపుతారు.
 
కర్కాటకం:- మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. విదేశీ వస్తువుల పట్ల ఆశక్తి పెరుగుతుంది. ప్రముఖుల కలయిక సాధ్యపడుతుంది. ఎలక్ట్రానిక్, ఎ.సి. రంగాల్లో వారికి కలిసి రాగలదు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. విందులలో పరిమితి పాటించండి. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
సింహం: - విదేశాల్లోని అభిమానుల క్షేమ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమికులకు పెద్దలనుంచి వ్యతిరేకత, ఆంక్షలు తప్పవు. నిరుద్యోగులు పోటీ పరీక్షలలో సఫలీకృతుతలౌతారు. స్త్రీలకు నరాలకు, కళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. రుణాలు తీరుస్తారు.
 
కన్య:- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్య క్రమాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలు కాగలవు. తెలివి తేటలతో వ్యవహారించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి.
 
తుల:- ప్రముఖుల కలయికతో మీ సమస్య ఒకటి సానుకూలమవుతుంది. సోదరీ, సోదరుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు.
 
వృశ్చికం: - కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలు విందులు, వినోదాలలో పలువురిని ఆకట్టుకుంటారు. కళలు, క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం.
 
ధనస్సు:- వ్యాపారాభివృద్ధికి కావలసిన ప్రణాళికలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో సమయస్పూర్తితో వ్యవహరించడం మంచిది. పుణ్యక్షత్రాలు, నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారిసహాయ సహకారాలు అందిస్తారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు.
 
మకరం:- కొబ్బరి, పండ్ల, పూల, పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం. రాజకీయ నాయకులు తొందరపడి వాగ్దానాలు చేయడంవల్ల ఇబ్బందులు తప్పవు. ద్విచక్ర వాహనం పై దూర ప్రయాణాలు క్షేమదాయకంకాదు. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు తనం కూడదు. ఊహించని ఖర్చులు, దుబారా వ్యయం అధికంగా ఉంటాయి.
 
కుంభం:- విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, మెళుకువ అవసరం. చిన్నతరహా, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ముఖ్యమైన వ్యవహారాలలో ఓర్పు, నేర్పుతో వ్యవహరించండి. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు.
 
మీనం:- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. మీ సంతానం ఉన్నత విద్య గురించి మంచి మంచి ఆలోచనలు, పథకాలు వేస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, ఇన్వర్టర్ రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. ఉద్యోగస్తులకు చికాకులు తొలగిపోతాయి. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు.