గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (22:48 IST)

01-10-2023 నుంచి 31-10-2023 వరకు అక్టోబరు నెల మాస ఫలితాలు

monthly horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
అన్ని రంగాల వారికి శుభదాయకమే. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. ఆందోళన కలిగించిన సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయం సంతృప్తికరం. వేడుకలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పెట్టుబడులు కలిసివస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. పరిచయాలు బలపడతాయి. బాధ్యతగా ఉండాలి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వస్త్ర, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. అధికారులకు హోదా మార్పు. ఉపాధ్యాయులకు పనిభారం. దైవదర్శనంలో ఒకింత అవస్థలెదుర్కుంటారు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు తగ్గించుకోవటం శ్రేయస్కరం. వ్యవహారాలతో తీరిక ఉండదు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మీ శ్రమ వృధా కాదు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు పనిభారం. ఉపాధ్యాయులు పురస్కాలు అందుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనలో ఆటంకాలను అధిగమిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. గృహమార్పు అనివార్యం. మీ ప్రమేయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీదైన రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. కార్యం సిద్ధిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. దూరపు బంధువుల ఆహ్వానం ఉల్లాసాన్నిస్తుంది. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. వస్త్ర, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులు ప్రశంసలందుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.
 
సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఓర్పు శ్రమిస్తే విజయం తధ్యం. నిరుత్సాహం వీడి యత్నాలు కొనసాగించండి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు తొలగుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తిచేయగల్గుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. బాధ్యతల నుంచి విముక్తులవుతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సత్కాలం సమీపిస్తోంది. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అయిన వారి ప్రోత్సాహం ఉంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు అధికం. పొదుపునకు అవకాశం లేదు. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. ఆరోగ్యం బాగుంటుంది. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. అవివాహితులకు శుభయోగం. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయాలి. వ్యవహరాలు అనుకూలించవు. చిన్న విషయం పెద్ద సమస్యగా మారే ఆస్కారం ఉంది. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలెదురవుతాయి. సమయానికి ఆప్తులు సాయం అందిస్తారు. ఆందోళన తగ్గి కుదుటపడతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సందేశాలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలీయవు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదామార్పు. ద్విచక్రవాహనదారులకు దూకుడు తగదు. 
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. మాటతీరు ఆకట్టుకుంటుంది. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. సంతానం దూకుడు సమస్యాత్మకమవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 
 
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. వ్యవహారజయం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. కొత్త పరిచయాలేర్పడతాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సంతానం కదలికలపై దృష్టిసారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. పోటీల్లో విజయం సాధిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ సమర్ధతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పనులు హడావుడిగా సాగుతాయి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం ఆశాజనకమే. కార్యం సిద్ధిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పెట్టుబడులు కలిసిరావు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు అదనపు బాధ్యతలు. వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పథంతో మెలగండి. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే మంచి ఫలితాలు. మీ శ్రేయస్సు కోరే వారు అధికమవుతారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటువుతుంది. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు స్థానచలనంతో చికాకులు తప్పవు. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. దైవదర్శనాలు ఉల్లాసం కలిగిస్తాయి.