గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 18 జులై 2021 (01:34 IST)

18-07-2021 నుంచి 24-07-2021 వరకు మీ వార రాశి ఫలితాలు (video)

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఈ వారం అనుకూలదాయకమే. ఆర్థిక సమస్యలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుటపడతారు. పనులు సానుకూలమవుతాయి. గృహరం ప్రశాంతంగా వుంటుంది. ఆప్తుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. జాతక పొంతన ముఖ్యం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. విశ్రాంతి అవసరం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు బాధ్యతల మార్పు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ ప్రతిపాదనలు ఉభయులకు ఆమోదయోగ్యమవుతుంది. శుభకార్యాన్ని నిరాడంబరంగా జరుపుతారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పత్రాలు అందుకుంటారు. ఆశించిన పదవులు దక్కవు. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ప్రియతములను కలుసుకుంటారు. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. రిటైర్డ్ ఉద్యోగులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పెట్టుబడుకు తరుణం కాదు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా వుంటుంది. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా వుండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనాలోచిన నిర్ణయాలు తగవు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఆదాయం సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పెట్టుబడుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. బుధవారం నాడు చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పిల్లల ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బందిగా వుంటుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ప్రియతముల రాక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గురు, శుక్ర వారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆరోగ్యం సంతృప్తికరం. చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
వ్యవహారాలతో తీరిక వుండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసాయం తగదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. హామీలు నిలబెట్టుకుంటారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు. శనివారం నాడు పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. అధికారులకు స్థానచలనం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. దైవకార్యాలకు సాయం అందిస్తారు. 
 
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
అన్ని రంగాల వారికి ఆశాజనకమే. మీ కృషి ఫలిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 3 పాదములు 
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పనులు చురుకు సాగుతాయి. మంగళ, బుధవారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి  పెడతారు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం 
ఆర్థిక సమస్యలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి వుండదు. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. పొదుపుధనం ముందుగా గ్రహిస్తారు, పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆది, గురువారాల్లో ప్రముఖులు సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఈ చికాకులు తాత్కాలికమే. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. శకునాలు పట్టించుకోవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. గృహమార్పు కలిసివస్తుంది. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కార్మికులకు కష్టకాలం. ప్రైవేట్ సంస్థ ఉద్యోగులకు ఏకాగ్రత ప్రధానం. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. గత సంఘటనలు పునరావృతమవుతాయి. ఏ విషయా్ని తేలికగా తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆదాయం బాగున్నా సంతృప్తి వుండదు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. శుక్ర, శనివారాల్లో పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పిల్లల ఉన్నత చదువులపై శ్రద్ధ వహించండి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు నిరుత్సాహకరం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పులు దొర్లే ఆస్కారం వుంది. అధికారులకు ఒత్తిడి, పనిభారం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి.
 


 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
ఆలోచనలతో మనస్థిమితం వుండదు. చిన్న విషయానికే ఆగ్రహిస్తారు. స్థిమితంగా వుండటానికి యత్నించండి. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆది, మంగళవారాల్లో అప్రమత్తంగా వుండాలి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహ పరుస్తుంది. పట్టుదలతో వ్యవహరించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేతివృత్తులు, కార్మికులకు ఆశాజనకం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
మీ కృషి ఫలిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. శుభకార్యాన్ని నిరాడంబరంగా చేస్తారు. ఊహించిన ఖర్చులే వుంటాయి. ఆప్తులకు సాయం చేస్తారు. పిల్లల పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. బుధ, గురువారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత లోపం. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ముఖ్యం. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చిరువ్యాపారులకు సామాన్యం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ధార్మిక సంస్థలకు సాయం అందిస్తారు.