ఆదివారం, 22 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2015 (11:10 IST)

ఫ్రాన్స్‌లో నాగ్-కార్తీ సినిమా.. స్టిల్ అదుర్స్.. ఇద్దరు హీరోలతో తమన్నా రొమాన్స్

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, కోలీవుడ్ క్రేజ్ హీరో కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఫ్రాన్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో నాగార్జున, కార్తీ గెటప్‌లు ఎలా ఉంటాయని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే వారిద్దరూ రెగ్యులర్ లుక్‌లోనే కనిపిస్తారని తాజా స్టిల్స్ ద్వారా తెలుస్తోంది. ది ఇన్‌టచ్‌బుల్స్ అనే ఫ్రెచ్ చిత్రం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ''దోస్త్'' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 
 
తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తమన్నా కార్తీ, నాగార్జున ఇద్దరిలో ఎవరి సరసన నటిస్తోందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇద్దరు హీరోలతో తమన్నా రొమాన్స్ చేయనుందని తెలిసింది. ఫ్రాన్స్‌లో మరో పది రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరుగనుంది. పీవీపీ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు.