Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ప్రధాని మోడీ అయోధ్య టూర్ షెడ్యూల్... 175 మంది ఆహ్వానితులు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 5 ఆగస్టు 2020 (09:44 IST)
అయోధ్య రామాలయం భూమిపూజ కోసం ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు చేరుకుంటారు. అక్కడ నుంచి అయోధ్యకు చేరుకుంటారు. 11.30గంటలకు హనుమాన్‌ గఢీ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. 
 
అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భూమిపూజ జరిగే ప్రదేశానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 12.45 గంటల మధ్య 32 సెకెన్ల పాటు భూమిపూజ చేస్తారు. కాశీలోని చేనేత కార్మికుడు బచ్చాలాల్‌ మౌర్య రూపొందించిన అంగవస్త్రంతో మహాకృతువులో పాల్గొంటారు. భూమిపూజ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పారిజాత మొక్క నాటనున్నారు. అనంతరం శ్రీరామజన్మభూమి మందిర్‌ పేరిట స్టాంపును విడుదల చేస్తారు.
 
కాగా, కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో భవ్యమైన రామాలయం శంకుస్థాపన కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరుకానున్నారు. కేవలం 175 మందికే శ్రీరామజన్మ భూమి క్షేత్ర ట్రస్టు ఆహ్వానం పంపింది. ఇందులో 135 మంది వివిధ క్షేత్రాలకు చెందిన సాధువులు ఉన్నారు. వేర్వేరు ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన ప్రతినిధులున్నారు. 
 
అయోధ్య భూవివాదంలో ముస్లింల తరపున పోరాడిన ఇక్బాల్‌ అన్సారీకి ట్రస్టు తొలి ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం శ్రీరాముడి నిర్ణయం కావచ్చని అన్సారీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వేదికపై కొద్ది మంది మాత్రమేలు అతిథులు ఆసీనులు కానున్నారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్‌ మహారాజ్‌, యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆసీనులు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్‌ జోషి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొనున్నారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments