శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అయోధ్య రామాలయం
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (21:39 IST)

రామ మందిరం ఎలా వుండబోతోంది? వివరాలు ఇక్కడ (video)

అయోధ్యలోని ప్రణాళికాబద్ధమైన రామాలయ రూపకల్పన ఎలా వుంటుందో తెలిపే నమూనాను ఆలయ పర్యవేక్షణ ట్రస్ట్ ఈ రోజు విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఇతర అగ్ర నాయకుల భూమి పూజ కార్యక్రమానికి ఒక రోజు ముందు ఈ నమూనా విడుదలయింది.
ఈ నమూనాలో ఆలయ శ్రేణి బహుళ అంతస్తులు, స్తంభాలు మరియు గోపురాలతో వున్న వేదికపై మూడు అంతస్తుల రాతి నిర్మాణం కనబడుతోంది. ఈ ఆలయం 161 అడుగుల ఎత్తు, అనుకున్న దాని కంటే రెట్టింపు పరిమాణంలో ఉంటుందని దాని వాస్తుశిల్పి తెలిపారు. ఇంటీరియర్స్ క్లిష్టమైన శిల్పాలతో ఎత్తైన గోపురం వుంటుంది.


 
ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పాల్గొననున్న 175 మంది ఆధ్యాత్మిక నాయకులతో పాటు భూమి పూజ వేడుక తరువాత నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి సుమారు మూడు సంవత్సరాలు పడుతుందని వాస్తుశిల్పి చెప్పారు.