శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (21:36 IST)

తలనొప్పి పరుగులు పెట్టాలంటే.. అలోవెరా జ్యూస్ తాగాలట!

Aloe vera
అలోవెరా జ్యూస్ ఒక గ్లాసు తీసుకుంటే తలనొప్పి నుంచి సులువుగా బయటపడొచ్చు. కాబట్టి ప్రతి రోజూ పరగడుపున ఒక గ్లాసు అలోవెరా జ్యూస్ తీసుకోవడం మంచిది. ఇంకా ట్యాక్సిన్లను తొలగించేందుకు కడుపులో ఉండే వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అలోవెరా జ్యూస్ బాగా సహాయపడుతుంది. 
 
కాబట్టి ఈ సమస్య నుండి బయట పడడానికి అలోవెరా జ్యూస్ తీసుకోవడం మరిచిపోకూడదు. కడుపు శుభ్రంగా లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ప్రతి రోజు కలబంద జ్యూస్ తాగితే మంచి ఫలితం వుంటుంది. 
 
పరగడుపున అలోవెరా జ్యూస్ తాగితే ఎర్ర రక్త కణాలు పెరిగి ఎనీమియా సమస్యని తగ్గిస్తుంది అలానే మంచి గ్లోయింగ్ స్కిన్ కూడా అలోవెరాతో మనం పొందవచ్చు. ఇలా మనకి కలబంద ఎంతగానో సహాయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.