సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (11:40 IST)

తమలపాకు రసాన్ని పాలల్లో కలిపి తీసుకుంటే..?

తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తమలపాకు రసంతో శ్వాసకోశ వ్యాధులను, గొంతునొప్పి నివారణకు ఉపయోగించుకోవచ్చు. తమలపాకు ఆకులకు నూనె రాసి కాస్త వేడి చేసి ఛాతిపై ఉంచితే శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి. అ

తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తమలపాకు రసంతో శ్వాసకోశ వ్యాధులను, గొంతునొప్పి నివారణకు ఉపయోగించుకోవచ్చు. తమలపాకు ఆకులకు నూనె రాసి కాస్త వేడి చేసి ఛాతిపై ఉంచితే శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి. అలాగే తమలపాకులకు నెయ్యి రాసి గాయాలకు కట్టుకడితే.. గాయాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవినొప్పి తగ్గిపోతుంది. ఇంకా శరీరానికి తాంబూల సేవనం ఎంతో మేలు చేస్తుంది. ఎముకలకు మేలు చేసే క్యాల్షియం ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి.
 
ఇంకా తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఫైబర్ తమలపాకులో ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే సున్నం, వక్క తదితర కృత్రిమ పదార్థాలు కలిపి తమలపాకును తీసుకుంటే శరీరానికి హాని చేస్తాయి. తమలపాకు యాంటీయాక్సిడెంట్ పనిచేస్తుంది, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.
 
ఇంకా ఆవనూనె, నువ్వులనూనె ఇతరత్రా నూనెలు చెడిపోకుండా ఉండాలంటే వాటిలో తమలపాకును వేసి నిల్వ చేయండి. తమలపాకును తొడిమితో తింటే మహిళల్లో వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి. కాబట్టి సంతానం కోరుకునే వారు తమలపాకును తొడిమిని తొలగించి వాడుకోవాలి. అయితే తమలపాకును ఔషధంగా మాత్రమే పరిమితంగా వాడుకోవాలి. అధిక రక్తపోటు గలవారు తమలపాకును దూరంగా పెట్టాలి. తమలపాకును అదే పనిగా తీసుకోకూడదు. 
 
తమలపాకులో సున్నం, పొగాకు కలిపి తీసుకోకూడదు. రోజూ 2నెలల పాటు ఒక తమలపాకు 10 గ్రాముల మిరియం గింజలు కలిపి తీసుకుని వెంటనే చన్నీళ్లు తాగితే స్థూలకాయులు నాజూగ్గా తయారవుతారు. అలాగే తమలపాకు రసాన్ని పాలల్లో కలిపి తీసుకుంటే మహిళల్లో కలిగే క్షణికావేశం తగ్గుతుంది. తమలపాకు రసాన్ని ముక్కుల్లో డ్రాప్స్‌గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. తమలపాకు ముద్దను తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.