బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By chj
Last Modified: మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (17:55 IST)

భోజనం అనంతరం సోంపూ తింటే...

భోజనం చేసిన తర్వాత రోజూ పది గ్రాముల సోంపును తింటే చాలా మంచిది. దీనివల్ల జీర్ణక్రియ, శ్వాసక్రియ సాఫీగా జరుగుతాయి. అంతేగాకుండా ఇది శరీరంలో ఉండే కొవ్వును అదుపులో ఉంచుతుంది. ఆస్తమా, దగ్గు వంటి వ్యాధులు ఉన్న రోగులు సోంపును తినడం వల్ల ఉపశమనం పొందుతారు. కఫా

భోజనం చేసిన తర్వాత రోజూ పది గ్రాముల సోంపును తింటే చాలా మంచిది. దీనివల్ల జీర్ణక్రియ, శ్వాసక్రియ సాఫీగా జరుగుతాయి. అంతేగాకుండా ఇది శరీరంలో ఉండే కొవ్వును అదుపులో ఉంచుతుంది. ఆస్తమా, దగ్గు వంటి వ్యాధులు ఉన్న రోగులు సోంపును తినడం వల్ల ఉపశమనం పొందుతారు. కఫాన్ని నివారించే గుణం ఇందులో ఉంది. కాళ్లు, చేతులకు మంట పుట్టినప్పుడు సొంపు పొడిని, చక్కెరను సమపాళ్లలో నీటిలో కలుపుకుని తాగితే ఉపశమనం కలుగుతుంది. 
 
దీనివల్ల కడుపు శుభ్రంగా ఉండడమే కాకుండా కడుపుబ్బరం సమస్య పూర్తిగా మాయమవుతుంది. బెల్లంతో సోంపును కలిపి తింటే మహిళలకు నెలసరిలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. సోంపు ఆకలిని పెంచుతుంది, మలబద్ధకాన్ని పోగొడుతుంది. అరుచిని తొలగిస్తుంది. మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
 
కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తులలో పేరుకున్న కఫాన్ని కరిగిస్తుంది. వికారాన్ని పోగొడుతుంది. అజీర్ణం వల్ల ఏర్పడిన కడుపునొప్పి తొలగిపోయి సుఖ విరేచనమవుతుంది.  సోంపు కషాయంలో పాలను చేర్చి తాగితే కంటి ఆరోగ్యం బాగుంటుంది. కంటి ఉబ్బు, వాపు తగ్గిపోతాయి.వాంతులను నివారిస్తుంది. నోటి దుర్వాసనను అరికడుతుంది. సోంపు కషాయాన్ని తాగితే స్ర్తిలలో రుతు సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. సోంపు కషాయంలో పటికబెల్లం పొడి వేసి వడ కట్టి పిల్లలకు తాగిస్తే పిల్లల్లో జీర్ణశక్తి పెరుగుతుంది.