ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (14:47 IST)

తెల్లబట్ట సమస్యకు తంగేడు పువ్వులు.. నల్ల వక్కలు, తంగేడు పువ్వుల పొడిని?

తంగేడు పువ్వుల రేకుల కషాయాన్ని తాగితే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. గుప్పెడు తంగేడు పువ్వుల రేకులు, నల్ల వక్కల పొడి ఓ స్పూన్, రెండు గ్లాసుల నీటిలో మరిగించి ఆ నీటిని వడగట

తంగేడు పువ్వుల రేకుల కషాయాన్ని తాగితే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. గుప్పెడు తంగేడు పువ్వుల రేకులు, నల్ల వక్కల పొడి ఓ స్పూన్, రెండు గ్లాసుల నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి తాగడం ద్వారా చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడుతాయని వారు సూచిస్తున్నారు. డయాబెటిస్‌ను నుంచి తప్పించుకోవాలంటే.. 30 ఏళ్లు దాటిన వారు మాసానికి ఓసారి లేదా రెండుసార్లు తంగేడు పువ్వుల కషాయాన్ని తప్పకుండా తీసుకోవాలి. 
 
ఇంకా తంగేడు పువ్వులను నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి.. అందుకు సమానంగా బెల్లం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ అరస్పూన్ తీసుకుంటే అతిమూత్ర వ్యాధి నయం అవుతుంది. అలాగే, తంగేడు ఆకులు 200 గ్రాములు, మెంతులు వందగ్రాములు చేర్చి మజ్జిగలో మెత్తగా నూరి.. తలపై వుంచి ఆముదపు ఆకుతో దాన్ని కప్పాలి. ఇలా ఉంచిన గంటకు తర్వాత తలస్నానం చేస్తే శరీరం చల్లబడుతుంది. 
 
ఎండిన తంగేడు పూల కషాయాన్ని రోజుకు ఒక పూట చొప్పున నెలరోజుల పాటు తాగితే, తెల్లబట్ట సమస్య తొలగిపోతుంది. ఇంకా తంగేడు పువ్వుల పొడిని ముల్తానీ మట్టితో కలుపుకుని ముఖానికి రాసుకుంటే చర్మం నిగారింపును సంతరరించుకుంటుంది. వారానికోసారి తంగేడు పువ్వుల పొడిని పాలతో లేదా పన్నీరుతో కలుపుకుని ముఖానికి రాసుకుంటే చర్మం కోమలంగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.