శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 29 ఆగస్టు 2017 (21:38 IST)

దోసకాయ, సొరకాయ గురించి మీకేం తెలుసు?

దోసకాయ... దోసకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. మలబద్దకం లేకుండా విరేచనము సాఫీగా అవాలంటే దోసకాయను తరుచు భుజించాలి. దోసగింజలను ఎండబెట్టి తింటుంటే చాలా మంచిది. ముఖ సౌందర్యానికి, చర్మ రక్షణకు, ముఖం కాంతివంతంగా వుండేందుకు దోసకాయలను చిన్నబద్దలుగా కోసి ముఖాన

దోసకాయ...
దోసకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. మలబద్దకం లేకుండా విరేచనము సాఫీగా అవాలంటే దోసకాయను తరుచు భుజించాలి.
దోసగింజలను ఎండబెట్టి తింటుంటే చాలా మంచిది.
ముఖ సౌందర్యానికి, చర్మ రక్షణకు, ముఖం కాంతివంతంగా వుండేందుకు దోసకాయలను చిన్నబద్దలుగా కోసి ముఖానికి, చర్మానికి రుద్దుకోవాలి.
 
సొరకాయ...
సొరకాయ జలుబు చేస్తుందని చాలమంది తినరు. కాని అది వట్టి అపోహ మాత్రమే. ఇది జలుబుతో పాటు, కఫాన్ని కూడా తగ్గిస్తుంది.
సొరకాయలో బాగా చలువ చేసే గుణం కలదు.
కడుపులో మంటని అతి దాహాన్ని సొరకాయ తగ్గిస్తుంది.
 
అరికాళ్ళు పగిలినచోట సొరకాయగుజ్జును రాసి మృదువుగా మర్దనం చేస్తే ఉపశమనం కలుగుతుంది.
సొరకాయ ముక్కలను తింటే దగ్గు రాకుండా, కఫం లేకుండా చేస్తుంది.
సొరకాయ గర్భస్రావాన్ని కలిగించే గుణం కలది కాబట్టి దీన్ని గర్భిణిలు తినకుండా వుండటం మంచిది.