శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (13:23 IST)

బాగా అలసిపోయారా..? ఐతే ప్లమ్ పండ్లను తీసుకోండి

ప్లమ్ పండ్లను తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులోని ఫ్లేవనాయిడ్స్ ఊబకాయాన్ని నిరోధిస్తాయి. వీటిలో వుండే కె విటమిన్ గుండెజబ్బుల్ని కూడా దూరం చేస్తుంది. బాగా అలసిపోతే ఈ

ప్లమ్ పండ్లను తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులోని ఫ్లేవనాయిడ్స్ ఊబకాయాన్ని నిరోధిస్తాయి. వీటిలో వుండే కె విటమిన్ గుండెజబ్బుల్ని కూడా దూరం చేస్తుంది. బాగా అలసిపోతే ఆరు ప్లమ్ పండ్లను తీసుకోవడం ద్వారా శక్తి లభిస్తుంది. ఈ పండ్లు కండరాలకు ఉత్తేజాన్నిస్తాయి. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. ఈ పండ్లను రోజుకొకటి తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. 
 
ఎముకలకూ కూడ బలాన్నిచ్చే ప్లమ్స్‌ను వృద్ధులు ఎక్కువగా తీసుకోవడం మంచిది. ప్లమ్‌ పండ్లను రోజూ పిల్లలు తీసుకోవడం ద్వారా బాగా ఎదుగుతారు. ఇవి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. జీవక్రియ వేగాన్ని పెంచుతాయి. పీచు, విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని ఇసాటిన్‌, సార్బిటాల్‌... వంటి పదార్థాలు టాక్సిన్లు తొలగిస్తాయి.
 
ఇకపోతే అధిక రక్తపోటును నియంత్రించే పొటాషియం ప్లమ్ పండ్లలో పుష్కలంగా వున్నాయి. టైప్-2 డయాబెటిస్‌ను కూడా ఇవి దరిచేరనివ్వవు. యాంటీ-యాక్సిడెంట్లు పుష్కలంగా వుండే ఈ పండ్లను వారానికి నాలుగైదు సార్లు తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.