శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (11:38 IST)

నువ్వుల పొడి కషాయంతో.. ఆ సమస్యకు చెక్..?

నేటి తరుణంలో స్త్రీలు రుతుక్రమం క్రమం తప్పుతుందని బాధపడుతున్నారు. దాంతో కడుపునొప్పి విపరీతంగా మారుతుంది. అంతేకాదు.. రకరకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకు ఏం చేయాలో తెలియక వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు. అయినను సమస్య కాస్త తగ్గలేదని సతమతమవుతున్నారు. అలాంటి వారికి నువ్వుల కషాయం ఎంతో మేలు చేస్తుంది.. ఎలా చేయాలంటే...
 
కావలసిన పదార్థాలు:
నల్ల నువ్వుల పొడి - 2 స్పూన్స్
నీరు - 300 మిల్లీ లీటర్లు
బెల్లం - కొద్దిగా.
 
తయారీ విధానం:
ముందుగా నీటిలో నల్ల నువ్వుల పొడి వేసి బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్లల్లో బెల్లం కలిపి వడగట్టుకోవాలి. ప్రతిరోజూ ఈ కషాయాన్ని రెండు పూటలా తాగాలి. అప్పుడే రుతుక్రమం సక్రంగా వస్తుంది. లేదంటే చాలా కష్టం. కనుక తప్పక కషయాన్ని తాగి చూడడం ఫలితం ఉంటుంది.