ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2023 (20:06 IST)

హెర్బల్ టీలో చక్కెర వాడవచ్చా? వేడి చేసి వేడి చేసి తాగవచ్చా?

Herbal Tea
కాఫీ, టీలకు ప్రత్యామ్నాయంగా హెర్బల్ టీ తాగడం చాలామంది చూస్తున్నాం. అయితే కొంతమంది హెర్బల్ టీలో పంచదార కలుపుకుని తాగుతారు. అలా హెర్బల్ టీలో పంచదార వాడటం మంచిదా లేదా అనేది తెలుసుకుందాం. 
 
టేస్టు కోసం హెర్బల్ టీలో పంచదార కలపడం మానుకోవాలని, పంచదార కలిపితే హెర్బల్ టీ వల్ల ప్రయోజనం ఉండదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. చక్కెరకు బదులుగా తేనెను జోడించవచ్చు. అయితే అదే సమయంలో హెర్బల్ టీ చాలా వేడిగా ఉన్నప్పుడు తేనె కలపకూడదు. మితమైన వేడిలో మాత్రమే కలపాలి.
 
హెర్బల్ టీలను చాలా వేడిగా లేదా చల్లగా తీసుకోకూడదని... మితంగా సిప్ చేయాలని సాధారణంగా చెబుతారు. అదేవిధంగా హెర్బల్ టీ మిగిలిపోయినా, కొన్ని గంటల తర్వాత వేడిచేస్తే అందులోని హెర్బల్ పోషకాలు శరీరానికి అందవని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.