శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2018 (16:21 IST)

మునగ ఆకులు, మునగ పువ్వులకు ఆ శక్తి వుంది...

మునగాకును రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను నియంత్రించుకోవచ్చు. అలాగే గర్భాశయంలో వచ్చే కంతుల పరిమాణాన్ని తగ్గించడంలో మునగాకు కీలకంగా పనిచేస్తుంది. మహిళలు గర్భం దాల

మునగాకును రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను నియంత్రించుకోవచ్చు.

అలాగే గర్భాశయంలో వచ్చే కంతుల పరిమాణాన్ని తగ్గించడంలో మునగాకు కీలకంగా పనిచేస్తుంది. మహిళలు గర్భం దాల్చినప్పుడు మునగాకును తప్పనిసరిగా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
మునగ ఆకులు, పువ్వుల్లో విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తాయి. తద్వారా ఇన్ఫెక్షన్లు దరిచేరవు. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా జలుబు, జ్వరం తగ్గుతుంది. జలుబు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు మునగాకు సూప్‌ను తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారికి మునగాకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. 
 
అంతేగాకుండా శరీరంలోని ట్యాక్సిన్లను తొలగించుకోవచ్చు. పిల్లల్లో ఎముక సాంద్రతను పెంచే లక్షణాలు మునగాకు, గింజలకూ ఉన్నాయి. మధుమేహం బాధపడేవారు, మధుమేహానికి దూరం కావాలనుకునే వారు వారానికి మూడుసార్లు ఆహారంలో మునగాకు చేర్చుకోవాలి. తద్వారా రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.