శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (11:07 IST)

డైజెస్టివ్ బిస్కెట్లు తింటున్నారా? కాస్త ఆపండి..

తేలికగా జీర్ణమయ్యే బిస్కెట్లు మార్కెట్లలో విరివిగా లభిస్తున్నాయి. డైజస్టివ్ బిస్కెట్లు ఉదయం పూట తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే.. డైజస్టివ్ బిస్కెట్లలో చక్కెర, సోడియం,

తేలికగా జీర్ణమయ్యే బిస్కెట్లు మార్కెట్లలో విరివిగా లభిస్తున్నాయి. డైజస్టివ్ బిస్కెట్లు ఉదయం పూట తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే.. డైజస్టివ్ బిస్కెట్లలో చక్కెర, సోడియం, శుద్ధిచేయబడిన పిండి అధికంగా వున్నాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. డైజస్టివ్ బిస్కెట్లు ఆకలిని తీర్చినా అత్యధిక ప్రాసెస్ ద్వారా ఆరోగ్యానికి చేటేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇందులో పీచు వున్నప్పటికీ.. ఈ బిస్కెట్లకు రుచిని ఎక్కువగా కలిగించే పదార్థాలను కలపడం ద్వారా ఈ బిస్కెట్లను మళ్లీ మళ్లీ తినాలనిపిస్తాయి. బూజు పట్టకుండా, చెడిపోకుండా వుండేందుకు, ఎక్కువ కాలం నిల్వవుండేందుకు కొన్ని రసాయనాలను కలుపుతుంటారు.
 
ఈ బిస్కెట్లలో అనారోగ్యాలకు కారణమయ్యే కేలరీలు ఎక్కువగా వుంటాయి. డైజస్టివ్ బిస్కెట్లలో కనీసం 50 కేలరీలుంటాయి. ఇంకా చక్కెర, పిండి, సోడియంలలో ఉండే అనారోగ్యకర కేలరీలు శరీర బరువును పెంచుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.