శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (14:29 IST)

జామ ఆకులతో ఇంత మేలు జరుగుతుందా?

జామ ఆకులతో చేసిన కషాయాన్ని తాగితే శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతోపాటు చాలాసేపటి వరకు ఆకలి వేయదు. పైగా కేలరీలు లేని పోషకాలు అందడం వల్ల బరువు కూడా తగ్గుతారు. అలాగే జామ ఆకులు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
 
బయటి కాలుష్యం వల్ల చర్మం రకరకాల సమస్యలను ఎదుర్కొంటుంది. నల్లబడడం, మచ్చలు, డెడ్​సెల్స్​ పేరుకుపోవడం వంటి సమస్యలు తగ్గాలంటే జామ ఆకులతో చేసిన పేస్ట్​ను స్ర్కబ్బర్​లా వాడాలి. దీనివల్ల చర్మానికి అవసరమైన అన్ని పోషకాలు అందడంతోపాటు శుభ్రపడుతుంది. జామపండులో ఫైబర్​ కంటెంట్​ ఎక్కువగా ఉంటుంది. అయితే జామపండు కంటే కూడా జామ ఆకులో డైటరీ ఫైబర్​ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో జామ ఆకుల రసం తాగినా జీర్ణశక్తి పెరుగుతుంది.
 
ఐదారు ఆకుల నుంచి రసాన్ని తీసి తాగితే శరీరానికి అవసరమయ్యే ఫైబర్​లో 12 శాతం భర్తీ అవుతుంది. అంతేకాదు.. అజీర్తి కారణంగా వాంతులు, విరేచనాలు అవుతుంటే జామ ఆకులతో చేసిన టీ తాగిస్తే వెంటనే ఆగిపోతాయి. అంతేకాదు.. బాడీ డీహైడ్రైడ్​ కాకుండా ఉంటుంది. 
 
పీరియడ్స్ టైమ్‌‌లో చాలా మంది మహిళలు పొత్తికడుపు నొప్పితో బాధపడుతుంటారు. అయితే ఈ నొప్పి తగ్గాలంటే జామ ఆకుల రసం తాగాలి. లేదంటే టీ చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. రోజూ తాగినా మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం దరి చేరదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
జామ ఆకులతో చేసిన కషాయాన్ని తాగితే శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతోపాటు చాలాసేపటి వరకు ఆకలి వేయదు. పైగా కేలరీలు లేని పోషకాలు అందడం వల్ల బరువు కూడా తగ్గుతారు. అలాగే జామ ఆకులు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
 
బయటి కాలుష్యం వల్ల చర్మం రకరకాల సమస్యలను ఎదుర్కొంటుంది. నల్లబడడం, మచ్చలు, డెడ్​సెల్స్​ పేరుకుపోవడం వంటి సమస్యలు తగ్గాలంటే జామ ఆకులతో చేసిన పేస్ట్​ను స్ర్కబ్బర్​లా వాడాలి. దీనివల్ల చర్మానికి అవసరమైన అన్ని పోషకాలు అందడంతోపాటు శుభ్రపడుతుంది. జామపండులో ఫైబర్​ కంటెంట్​ ఎక్కువగా ఉంటుంది. అయితే జామపండు కంటే కూడా జామ ఆకులో డైటరీ ఫైబర్​ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో జామ ఆకుల రసం తాగినా జీర్ణశక్తి 
పెరుగుతుంది.