శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (10:51 IST)

రోజుకు ఓ స్పూన్ కంటే ఉప్పు మించితే? బీపీ ఖాయం..!

బీపీ అంటే రక్తపోటు సాధారణంగా పంచదార పదార్థాలు అధికంగా తీసుకోవడంతోనే వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఈ జాబితాలోకి ఉప్పుకూడా వచ్చి చేరిపోయింది. పంచదారే కాదు.. ఉప్పు వల్ల కూడా మధుమేహం బారినపడే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడి అయ్యింది. 
 
ఉప్పు ద్వారా లభించే సోడియంను తక్కువ మొత్తంలో తీసుకునేవారితో పోలిస్తే.. రోజుకు ఒకటిన్నర స్పూన్లు అంతకంటే ఎక్కువ తీసుకునే వారిలో మధుమేహం వచ్చే అవకాశం 72 శాతం ఎక్కువగా వున్నట్లు అధ్యయనకారులు తేల్చారు. ఉప్పు ద్వారా శరీరంలోకి చేరే సోడియం ఇన్సులిన్‌ను నిరోధిస్తుందని.. ఇది మధుమేహానికి దారి తీస్తుందని అధ్యయన కారులు పేర్కొన్నారు. 
 
ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తపోటుకు గురికావడంతోపాటు బరువు కూడా పెరగుతారని, మధుమేహానికి ఇవి రెండూ శత్రువులేనని పరిశోధకులు తెలిపారు. కాబట్టి ఉప్పును రోజుకు ఓ స్పూన్ కంటే ఎక్కువ తీసుకోకూడదని అధ్యయనకారులు సూచిస్తున్నారు. లేకుంటే ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.