శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : శనివారం, 11 నవంబరు 2017 (11:28 IST)

వర్షాకాలంలో శొంఠి చేసే మేలు

శొంఠిని నేతితో వేయించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మొదటి ముద్ద అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి, గ్యాస్ సంబంధిత సమస్యలు, పొట్టలో వికారం వంటివి అన్నీ తొలగిపోతాయి. శొంఠి

శొంఠిని నేతితో వేయించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మొదటి ముద్ద అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి, గ్యాస్ సంబంధిత సమస్యలు, పొట్టలో వికారం వంటివి అన్నీ తొలగిపోతాయి. శొంఠి ఆకలిని పెంచుతుంది. జీర్ణ రసాలు ఊరడాన్ని ప్రేరేపిస్తుంది. అల్లం తాగడం ద్వారా అజీర్తి తగ్గుతుంది. అల్లం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌కు చెక్ పెడుతుంది. కండరాల నొప్పుల్ని తగ్గిస్తుంది. 
 
గర్భిణీల్లో తలతిరగడం, వికారం, వేవిళ్లు ఎక్కువగా ఉంటాయి. అల్లం తినడము వలన బాగా ఉపశమనం కలుగుతుంది. వర్షాకాలం జలుబూ, దగ్గు వంటి సమస్యలు ఎదురవుతాయి. జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే మరుగుతున్న టీ లేదా కాఫీలో కూడా ఈ పొడిని కొద్దిగా కలిపినా ప్రయోజనం ఉంటుంది. 
 
జలుబు తీవ్రత ఎక్కువగా ఉంటే శొంఠి పొడికి చిటికెడు బెల్లం ముక్క కలిపి రోజూ రెండు మూడు సార్లు తినాలి. అలాగే చెంచా శొంఠి పొడికి చిటికెడు లవంగాల పొడి, ఉప్పు ఒకటిన్నర కప్పు నీటిలో వేసి మరగనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే జలుబును నివారించవచ్చు. 
 
వేడి అన్నంలో శొంఠి పొడిని, పప్పునూనెను కలిపి ప్రతీ రోజూ మొదటి ముద్దగా తింటే అజీర్తి పోయి ఆకలి పెరుగుతుంది. అలాగే పరగడుపున నీళ్లల్లో శొంఠి పొడి కలిపి మరగించి, అరచెంచా తేనె కలిపి తాగితే కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాదు, బరువూ అదుపులో ఉంటుంది. ఈ పొడిని వేడి పాలల్లో వేసుకుని, చిటికెడు చక్కెర కూడా కలిపి తాగితే మూత్రాశయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.